Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గోరంట్ల మాధవ్ కు మరో షాక్- లోకేష్ పై అక్కా-బావ కామెంట్స్ ఎఫెక్ట్..!

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పోలీసులు వరుసగా షాకులిస్తున్నారు. ఇప్పటికే అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో మాధవ్ పై వరుస కేసులు నమోదవుతున్నాయి. అయినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా వారిని వెంబడించి తనకు అప్పగించాలంటూ రచ్చ రచ్చ చేసిన వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే మరో షాకిచ్చారు.

నిన్న తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ .. మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పోలీసులు తగిన భద్రత కల్పించకపోవడంపై మాధవ్ నిప్పులు చెరిగారు. అదే క్రమంలో ఆడవాళ్లకు అక్కా కాదు, మగవాళ్లకూ బావా కాని లోకేష్ బాబుకు జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చి సీఆర్పీఎఫ్ బలగాల్ని కేటాయించి, ఇమాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ కు భద్రత ఇవ్వరా అంటూ మాధవ్ ప్రభుత్వాన్ని తీవ్ర స్ధాయిలో ప్రశ్నించారు.

another setback to former ysrcp mp Gorantla madhav case registered for remarks on nara lokesh

మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి అక్కా-బావా కాని వాడు అంటూ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి మంట పుట్టించనట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. నిన్న తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ పై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో జి. నాగేశ్వరరావు అనే తాడేపల్లి కి చెందిన టీడీపీ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో త్వరలో గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చే అవకాశముంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+