జగన్ మరో నిర్ణయానికి చెక్ పెట్టేసిన చంద్రబాబు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం తాలుకు ఆనవాళ్లు కనిపించకుండా మార్పులు చేర్పులు చేసేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రాకముందు అప్పటీ డీడీపీ ప్రభుత్వం తీసుుకున్న నిర్ణయాలకు జగన్ ఎలా చెక్ పెట్టారో ఇప్పుడు చంద్రబాబు కూడా అదే రూల్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.
రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగినప్పుడు వేగంగా స్పందించి కేసులు నమోదు చేసేందుకు వీలుగా గతంలో వైసీపీ సర్కార్ దిశా చట్టం తీసుకొచ్చింది. హైదరాబాద్ లో దిశ( పేరు మార్చారు) అనే యువతిపై జరిగిన అత్యాచారం, హత్య తర్వాత వైసీపీ ప్రభుత్వం అప్పట్లో తీసుకొచ్చిన ఈ దిశ చట్టాన్ని కేంద్రం కొర్రీలు పెడుతూ వచ్చింది. అయితే ఆ లోపే మహిళా పోలీసు స్టేషన్లను దిశా పోలీసు స్టేషన్లుగా మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మహిళా పోలీసు స్టేషన్లు కాస్తా దిశా పోలీసు స్టేషన్లుగా మారిపోయాయి.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తిరగతోడింది. రాష్ట్రంలో దిశా పోలీసు స్టేషన్లను తిరిగి మహిళా పోలీసు స్టేషన్లుగా పేరు మారుస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని దిశా పోలీసు స్టేషన్లన్నీ మళ్లీ మహిళా పోలీసు స్టేషన్లుగా పేరు మార్చుకోబోతున్నాయి. అయితే వీటిలో లబించే సేవల్లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. కేవలం పేరు మాత్రమే మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై లభించే సేవలపై మాత్రం ఎలాంటి ప్రస్తావన లేదు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications