నాటకాల్లో ఆడవేషాలు, సినిమాల్లో అందాల హీరో

హైదరాబాద్: అక్కినేని నాగేశ్వర రావు నవలా నాయకుడిగా పేరు పొందారు. నవలలను చిత్రాలుగా రూపొందించే క్రమంలో కథానాయకుడు ఆయన అయ్యారు. యద్ధనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి వంటి రచయిత్రుల నవలలను ఓ స్థితిలో పెద్ద యెత్తున సినిమాలుగా నిర్మించారు. చక్రవాకం, డాక్టర్ చక్రవర్తి, ప్రేమనగర్ వంటి పలు సినిమాల్లో అక్కినేని కథానాయకుడిగా నటించి మెప్పించారు. దాంతో ఆయనకు నవలా నాయకుడిగా పేరు వచ్చింది.

నాటకాల్లో అక్కినేని నాగేశ్వర రావు స్త్రీవేషాలు వేసేవారు. దాంతో ఆ మార్దవం ఆయన హీరో వేషాల్లో కూడా కనిపించేది. ఓ వైపు ఎన్టీ రామారావు తన గంభీరమైన కంఠస్వరంతో, ఎత్తయిన విగ్రహంతో తెలుగు సినిమాను ఊపేస్తుంటే, తక్కువ పొడగరి కావడమే కాకుండా ఆ గంభీర స్వరం లేని నాగేశ్వర రావు తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ విషయాన్ని అక్కినేని నాగేశ్వర రావు ఓ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు.

ANR lady roles in dramas and first film Dharam patni

ధర్మపత్ని సినిమాతో రంగప్రవేశం చేసిన అక్కినేని నాగేశ్వరరావు తనదైన శైలితో ఏ మాత్రం జంకకుండా ఎన్టీ రామారావుకు ధీటైన కథానాయకుడిగా నిలిచారు. ఇరువురు తెలుగు సినిమా రంగంలో సమవుజ్జీలుగా నిలిచారు. తెలుగు సినిమాను ఓ తరం పాటు ఊపేశారు. అభిమాన సంపదలోనూ ఇరువురికి అంతే స్థాయి ఉంది.

ప్రేమికుడిగా, ప్రేమ విఫలమైన విషాద కథానాయకుడిగా అక్కినేని తెలుగు సినీరంగంలో మరొకరు సాటి రారు అన్నట్లుగా నిలిచిపోయారు. ప్రేమనగర్ సినిమా నుంచి మేఘ సందేశం వరకు ఆయన ప్రేమ పిపాసిగా సినీరంగాన్ని అలరించారు. దేవదాసు పాత్ర ఆయన నటనాసామర్థ్యానికి పరాకాష్ట. అక్కినేని నాగేశ్వర రావులా చేయలేకపోయానని హిందీ దేవదాసు సినిమాలో నటించిన దిలీప్ కుమార్ కూడా అన్నారంటే ఆ పాత్రకు ఆయన ఎంతగా జీవం పోశారో అర్థం చేసుకోవచ్చు.

దేవదాసు పాత్రకు అక్కినేని నాగేశ్వర రావు తప్ప మరొకరు జీవం పోయలేరనే అభిప్రాయం స్థరపడిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ కూడా దేవదాసుగా నటించారు. ఈ సినిమా విజయవంతం అయినప్పటికీ అక్కినేని పేరును చెరిపివేయలేకపోయింది. కృష్ణ దేవదాసు సినిమాతో పాటు అక్కినేని దేవదాసు కూడా విడుదలై మరోసారి ఘన విజయం సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+