AP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు ! స్కూళ్లకు జనవరి 31 డెడ్ లైన్..!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరిగే ఎన్నికలకు ఎన్నికల సంఘం పూర్తిస్దాయిలో కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన ఈసీ బృందం.. అధికారులతో కీలక భేటీ నిర్వహించి పలు సూచనలు చేసింది. దీంతో పాటు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తోంది. వాటికి అనుగుణంగా ప్రభుత్వం కూడా స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలుగా పలు స్కూళ్లను ఎంపిక చేశారు. ఈ స్కూళ్లలో పోలింగ్ నిర్వహణకు వీలుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇందుకోసం అవసరమైతే నాడు-నేడు నిధుల్ని వాడుకోవాలని సూచించారు. దీంతో ఆయా స్కూళ్లు పోలింగ్ కేంద్రాలుగా సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఏమేం చేయాలో కూడా విద్యాశాఖ సూచించింది.

ap asseembly election preparations begins as government orders to prepare schools for polls

పోలింగ్ కేంద్రాలుగా ఎంపికైన స్కూళ్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం జనవరి 31ని గడువుగా నిర్ణయిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అప్పటిలోగా పోలింగ్ కేంద్రాలైన స్కూళ్లలో ఈసీ నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో గదుల్లో ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, దివ్యాంగుల కోసం ర్యాంపులు వంటివి ఉన్నాయి. వీటిని వచ్చే నెలాఖరులోగా ఏర్పాటు చేయాలని, ఇందులో విఫలమైతే హెచ్ఎంలపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

పోలింగ్ కేంద్రాలుగా ఎంపికైన స్కూళ్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం నిధులను కూడా ఎలా సమీకరించుకోవాలో విద్యాశాఖ సూచించింది. ప్రస్తుతం నాడు-నేడు రెండోదశ కోసం కేటాయించిన నిధుల్ని వీటి కోసం వాడుకోవాలని, అవి సరిపోకపోతే సమీపంలోని పాఠశాలలకు కేటాయించిన నిధుల్ని కూడా వాడుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+