AP Cabinet: ఏపీ కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ..! ఐదుగురికి ఛాన్స్? జనసేనకు మరో మంత్రి..!
ఏపీలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో మిశ్రమ స్పందన ఉంది. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఇలాంటి కీలక సమయంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు (ap cabinet reshuffle) రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగే సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట ఇవాళ బాంబు పేల్చారు. అంతే కాదు కేబినెట్ లో భారీ మార్పులు తప్పవంటూ ఓ జాబితా కూడా విడుదల చేశారు.
రాష్ట్ర కేబినెట్ భారీ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోందని ప్రవీణ్ పుల్లట వెల్లడించారు. ఈ మేరకు ప్రస్తుత మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయన్నారు. మెజారిటీ మంత్రులకు ఉద్వాసన తప్పదనే సంకేతాలు ఇచ్చారు. ఖచ్చితంగా కొత్త మంత్రివర్గంలోకి అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు వీరే అంటూ ఐదుగురు పేర్లు వెల్లడించారు. వీరిలో ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు జనసేన నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఉన్నారు.

కూటమి కేబినెట్ భారీ ప్రక్షాళన దిశగా కసరత్తు.
— Praveen Pullata (@praveenpullata) March 10, 2026
ప్రస్తుత మంత్రివర్గంలో భారీ మార్పులు!
మెజారిటీ మంత్రులకు ఉద్వాసన తప్పదనే సంకేతాలు.
ఖచ్చితంగా కొత్త మంత్రివర్గంలోకి అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు వీరే!
1. పల్లా శ్రీనివాసరావు - గాజువాక
2. బెందాళం అశోక్ - ఇచ్చాపురం
3. మద్దిపాటి వెంకటరాజు -…
కొంచెం అటు ఇటుగా లోకేశ్ టీమ్ తోనే కొత్త కేబినెట్ కూర్పు ఉంటుందని ప్రవీణ్ పుల్లట వెల్లడించారు. ఉగాదికి కాకపోయినా భారీ మార్పులతోనే కొత్త మంత్రివర్గం ఉంటుందన్నారు. మరోవైపు ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి రెవెన్యూ శాఖ అప్పగించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే పల్లా శ్రీనివాసరావు స్థానంలో మంత్రుల్లో కొల్లు రవీంద్ర లేదా అనగాని సత్యప్రసాద్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందన్నారు. అయితే ఈ మంత్రులు ఎవరి స్ధానంలో కేబినెట్ లోకి రాబోతున్నారో మాత్రం ఆయన వెల్లడించలేదు.
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications