AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు- లక్ష కోట్ల పెట్టుబడులకు ఓకే..!

ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఇవాళ మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్ పాలసీ, టూరిజం పాలసీ, ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానాలకు ఆమోదం తెలిపింది. అలాగే లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు సైతం ఆమోదముద్ర వేసింది. ఇవాళ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పార్ధసారధి వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ నేషనల్ క్వాంటమ్ మిషన్ తో అనుసంధానం చేస్తూ రాష్ట్ర క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోం సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రతీ మండలంలో నైబర్ హుడ్ వర్క్ స్పేస్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ప్రతీ చోటా 20-30 వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. తాజాగా ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన లక్ష కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర డ్రోన్ సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

ap cabinet took key decisions including nod to 1lakh crore investments

కుప్పం, దగదర్తి ఎయిర్ పోర్టులకు భూసేకరణకు హడ్కో రుణం పొందేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పలు రంగాల్లో ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఎంఓయూ కుదుర్చుకునేందుకు ఐటీ మంత్రి, అధికారులకు అధికారం ఇచ్చారు. సీఆర్డీయే పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఉండవల్లి వద్ద అమరావతి వరద పంపింగ్ స్టేషన్ 2 ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

అన్నదాత సుఖీభవ పథకానికి ఆర్ధిక సాయం అందించేందుకు వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కౌలు రైతులకు గతంలో కేంద్రం ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం వాటాతో కలిపి ఇస్తుందన్నారు. ఖరీఫ్ రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు పౌరసరఫరాలశాఖకు ప్రభుత్వ గ్యారంటీ గరిష్ట పరిమితి 44 కోట్లకు పెంచారు. విజయవాడ, విశాఖలో జీఎస్టీ సేవల అప్పిలేట్ ట్రైబ్యునల్ లో 19 కొత్త పోస్టుల కల్పనకు ఆమోదం తెలిపారు. తిరుపతి జిల్లా ఆవిలాలలో టీడీపీ ఆఫీసు కోసం ఏడాదికి వెయ్యి చొప్పున 33 ఏళ్ల పాటు 2 ఎకరాలు ఇచ్చేలా ఆమోదం తెలిపారు.
అన్నదాత సుఖీభవ పథకం ఆధార్ సీడింగ్ కోసం సేవా రుసుము మినహాయింపుకు ఆమోదం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+