ఏపీ కల్తీ మద్యం ఎపిసోడ్ లో మరో వికెట్..! సర్కార్ ఆదేశాలు..!

ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లాలో కల్తీ కల్లు తయారీ కేంద్రంపై జరిపిన దాడుల్లో భారీ ఎత్తున సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి నిందితుల్ని కోర్టు ద్వారా రిమాండ్ కు పంపారు. అదే సమయంలో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు టీడీపీ నేతలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలతో వేటు పడింది. దీనికి కొనసాగింపుగా ఇవాళ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం తయారీ జరుగుతున్నా ముందుగానే పసిగట్టడంలో విఫలమయ్యారంటూ ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు వేశారు. ఆమెను విజయవాడలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో కల్తీ మద్యం వ్యవహారంలో మూడో వికెట్ పడినట్లయింది. హిమబిందు స్ధానంలో లక్కిరెడ్డిపల్లి ఎక్సైజ్ సీఐ కిషోర్ కుమార్ కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

AP Cheap Liquor Case Mulakalacheruvu Excise CI Himabindu Transferred

తాజాగా అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు-మదనపల్లె పాత రోడ్డులో ఓ పాత డాబాలో విజయవాడకు చెందిన టీడీపీ నేతలు జనార్ధన్ రావు, రాజు కల్తీ మద్యం తయారు చేశారు. ఇలా తయారు చేసిన మద్యాన్ని విశాఖ, తమిళనాడు, ఒడిశాకు చెందిన పలువురితో ఇతర ప్రాంతాల్లో ఉన్న బెల్ట్ షాపులకు పంపి అమ్మిస్తున్నారు. దీనిపై తాజాగా ఎక్సైజ్ పోలీసులకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి భారీగా కల్తీ మద్యాన్ని, సామాగ్రిని సీజ్ చేశారు.

AP Cheap Liquor Case Mulakalacheruvu Excise CI Himabindu Transferred

ఏపీలో ఈ కల్తీ మద్యం వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందులో టీడీపీ నేతల పాత్ర బయటపడటంతో ముందు జాగ్రత్తగా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చంద్రబాబు.. ఈ కేసులో ఎంత పెద్ద వారైనా వదలొద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. అయితే రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కాంపై సీఐడీ సిట్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్న తరుణంలోనే ఈ వ్యవహారం బయటికి రావడంతో కూటమి సర్కార్ ఆత్మరక్షణలో పడింది. దీంతో నష్టనివారణ చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే టీడీపీ నేతల సస్పెన్షన్ తో పాటు ఎక్సైజ్ సీఐపై బదిలీ వేటు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+