ఈ చెట్టు కొడితే అంతే!...కాపలా కోసమే ఒక రెవిన్యూ ఉద్యోగి
చిత్తూరు జిల్లాలో ఓ చెట్టు కోసమే ఏకంగా రెవిన్యూ ఉద్యోగిని కాపలా పెట్టారు. అతడి పనల్లా ఆ చెట్టును ఎవరూ కొట్టకుండా 24 గంటలూ కాపలా కాయడమే...
ఇంతకీ ఏంటి ఆ చెట్టు స్పెషల్...ఎందుకు ఆ చెట్టు కాపలా కోసం ప్రత్యేకించి ఒక ఉద్యోగిని కాపలా పెట్టారంటే...
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం నడుంపల్లి గ్రామంలో ఉన్న ఈ మర్రి చెట్టు వయస్సు 80 ఏళ్లు. దశాబ్దాలుగా పెరిగి ఊడలు దిగుతూ విస్తరించిన ఈ మర్రి చెట్టు గ్రామస్థులకు ఏళ్ల తరబడి చల్లని నీడనిస్తూనే ఉంది. అయితే చల్లటి తల్లి లాంటి ఈ చెట్టు విస్తరించిన ప్రదేశం మీద కొందరు అక్రమార్కుల కన్నుబడింది. దీంతో ఈ గ్రామంలోని ఓ వర్గం వారు ఈ చెట్టును నరికేసి అక్కడ ఓ గుడి కట్టాలని నిర్ణయించారు. ఇటీవలికాలంలో ఆ ప్రయత్నాలు ఆరంభించారు.

అయితే ఆ ఊరులోని ఎక్కువమంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కావాలంటే ఈ చెట్టు కింద గుడి కట్టుకోమని, అంతేకాని చెట్టు తీసేసి గుడి కట్టేందుకు ఒప్పుకునేది లేదని...ఈ విషయమై చెట్టును కాపాడాలంటూ అధికారులకు వినతిపత్రాలిచ్చారు. అయితే ఈ విషయమై అధికారుల నుంచి స్పందన లేకపోవడం, చెట్టు కొట్టే ప్రయత్నాలు కొనసాగుతుండటంతో ఈసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీంతో ఈ చెట్టును కొట్టేయడానికి వీల్లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ చెట్టును ఎవరైనా కొట్టేస్తే నాన్ బెయిలబుల్ కేసు అవుతుందని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో జిల్లా న్యాయవాదులు గ్రామ పరిస్థితి, గ్రామంలో ఈ చెట్టు పరిస్థితిని పరిశీలించి ప్రత్యేకించి ఈ చెట్టు కాపలా కోసమే దీని వద్ద ఒక వీఆర్‌ఏను కాపలాగా పెట్టారు. ఆయన పనల్లా ఈ చెట్టును కొట్టేందుకు ఎవరూ రాకుండా చూడటమే!...
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications