రఘురామ-చంద్రబాబు-లోకేష్ వాట్సాప్ ఛాట్-జగన్ బెయిల్ రద్దు కుట్ర-సుప్రీంలో సీఐడీ షాకింగ్
వైసీపీ వర్సెస్ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరుకు ఏపీ సీఐడీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తాజా అఫిడవిట్ లో రఘురామకృష్ణంరాజుతో పాటు చంద్రబాబు, నారాలోకేష్, టీవీ 5, ఏబీఎన్ ఛానళ్లకు సంబంధించి సంచలన అంశాలను బయటపెట్టింది. సీఎం జగన్ బెయిల్ రద్దు కోసం వీరంతా కలిసి ఎలా కుట్ర చేశారో ఈ అఫిడవిట్ కళ్లకు కట్టింది. దీంతో రఘురామతో పాటు రెండు టీవీ ఛానళ్లపై పెట్టిన రాజద్రోహం కేసు ఏ మలుపు తిరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

రఘురామపై కేసులో సీఐడీ భారీ ట్విస్ట్
ఏపీలో వైసీపీ తరఫున ఎంపీగాై గెలిచి ఆ పార్టీపైనే నిత్యం యుద్ధం చేస్తున్న రఘురామకృష్ణంరాజు విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్ లో ఎలా పనిచేస్తున్నారో నిరూపించే ఆధారాల్ని సీఐడీ సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఇందులో పలు సంచలన అంశాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేసేలా ఉన్న ఈ అంశాలు రఘురామరాజుతో పాటు టీడీపీ పెద్దలు, టీవీ5, ఏబీఎన్ ఛానళ్లను ఆందేళనకు గురిచేస్తున్నాయి. దీంతో వీరిపై దాఖలైన రాజద్రోహం కేసులో ఇదే భారీ ట్విస్టుగా మారింది.

చంద్రబాబు-రఘురామ వాట్సాప్ ఛాట్
రఘురామకృష్ణంరాజుపై రాజద్రోహం కేసు విషయంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో సీఐడీ పేర్కొన్న అంశాలు సంచలనం రేపుతున్నాయి. ఇందులో రఘురామకృష్ణంరాజుతో విపక్ష నేత చంద్రబాబు నేరుగా వాట్సాప్ ఛాట్ చేసినట్లు సీఐడీ ఆరోపించింది. ఇందుకు తగిన ఆధారాలను కూడా సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వాట్సాప్ ఛాట్ లో వీరిద్దరూ మాట్లాడుకున్న కీలక అంశాలను కూడా సీఐడీ సుప్రీంకోర్టుకు అందించింది. దీంతో ఈ అంశాలు రఘురామపై రాజద్రోహం కేసులో చాలా కీలకంగా మారిపోనున్నాయి.

జగన్ బెయిల్ రద్దుపై ఏం మాట్లాడుకున్నారంటే ?
రఘురామకృష్ణంరాజుతో చంద్రబాబు జరిపిన వాట్సాప్ ఛాటింగ్ లో సీఎం జగన్ బెయిల్ రద్దు కోసం వీరిద్దరూ కలిసి కుట్ర చేసినట్లు సీఐడీ ఆరోపించింది. ఈ ఏడాది మార్చి 28, 29, ఏప్రిల్ 2, 3, 4వ తేదీల్లో చంద్రబాబుతో రఘురామకృష్ణరాజు ఈ వాట్సాప్ చాటింగ్ చేసినట్లు సీఐడీ ఆరోపించింది. సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కాపీని చంద్రబాబుకు రెండుసార్లు వాట్సాప్ చేశారని,. ఆ పిటిషన్ కాపీని చంద్రబాబు చూసి ఆమోదించాకే 2021 ఏప్రిల్ 6న న్యాయస్థానంలో దాఖలు చేశారని పేర్కొంది. జగన్ బెయిల్ రద్దు కోసం పిటిషన్ ఎలా వేయాలి, అందులో ఏయే అంశాలు చేర్చాలి వంటి అంశాల్ని వీరిద్దరూ వాట్సాప్ లో చర్చించుకున్నట్లు సీఐడీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కాపీని చంద్రబాబు స్వయంగా చూసి తన న్యాయ సలహాదారులతో చర్చించి ఆమోదించిన తరువాతే న్యాయస్థానంలో రఘు రామకృష్ణరాజు దాఖలు చేసినట్లు సీఐడీ సంచలన ఆరోపణలు చేసింది.

రఘురామతో లోకేష్ వాట్సాప్ ఛాట్
అలాగే ఈ ఏడాది మే 1న రఘురామకృష్ణంరాజుకూ, చంద్రబాబు తనయుడు లోకేష్ కూ మధ్య కూడా వాట్సాప్ లో మెసేజ్ లు సాగినట్లు సీఐడీ తమ అఫిడవిట్ లో ఆరోపించింది రఘురామకృష్ణరాజు, లోకేశ్‌లు తమ సంభాషణల్లో పలుమార్లు కొందరు న్యాయమూర్తుల పేర్లు, కోర్టుల బెంచ్‌ల పేర్లను కూడా ప్రస్తావించారని సీఐడీ ఆరోపించింది. ఏ పిటిషన్ ఏ న్యాయమూర్తి ముందుకు విచారణకు వస్తుంది, అప్పుడు సదరు న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో... అలా అయితే మనం ఏం చేయాలో... అంటూ వారిద్దరూ చాటింగ్ చేసినట్లు సీఐడీ సంచలన ఆరోపణలు చేసింది.
Recommended Video

45 వీడియోలు, వేల కొద్దీ వాట్సాప్ సందేశాలు
రఘరామకృష్ణంరాజుతో పాటు టీవీ5, ఏబీఎన్ ఛానళ్లపై దాఖలు చేసిన రాజద్రోహం కేసులో సీఐడీ దాఖలు చేసిన అఫిడవిట్ లో మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. రఘురామరాజు మాట్లాడిన 45 వీడియోల్ని సేకరించిన సీఐడీ, ఫోరెన్సిక్ విభాగాల సాయంతో వాటిని విశ్లేషించినట్లు పేర్కొంది. అలాగే చంద్రబాబు, లోకేష్ తో పాటు టీవీ5, ఏబీఎన్ యాజమాన్యాలు, ప్రతినిధులతో జరిపిన వేల కొద్దీ వాట్సాప్ ఛాట్ లను కూడా సీఐడీ తన అఫిడవిట్లో ప్రస్తావించింది. వీరంతా కలిసి జగన్ బెయిల్ రద్దుతో పాటు కులాల్ని రెచ్చగొట్టేందుకు ఎలా కుట్ర పన్నారో కూడా సీఐడీ అఫిడవిట్లో ఆధారాలతో సహా బయటపెట్టింది.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications