అంబానీ ఇంట పెళ్లి వేడుకలలో చంద్రబాబు
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఆసియా ఖండంలోనే అపర కుబేరుడుగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ తో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలలో సినీ, రాజకీయ, క్రీడారంగ ప్రముఖులు సందడి చేశారు.
ఘనంగా వివాహం... రాధికా, అనంత్ పెళ్లి వాగ్దానాల వీడియో వైరల్
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలో తమ వివాహ వాగ్దానాలను చదివి వినిపించారు. పెళ్లినాటి ప్రమాణాలుగా వీరిద్దరూ చేసిన వాగ్దానాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలలో భాగంగా నిర్వహించిన పెళ్లి ముగిసిన అనంతరం కొత్తజంటకు తిలకం దిద్ది ఇషా అంబానీ వారిద్దరిని ఇంటికి ఆహ్వానించారు.

కొడుకు పెళ్ళిలో నీతా అంబానీ ఎమోషనల్
కొత్త దంపతులు అంబానీ రెసిడెన్స్ అయిన ఆంటిల్లాకు చేరుకున్నారు. ఇషా అంబానీ వారిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. తన చిన్న కొడుకు పెళ్లిని అత్యంత ఘనంగా నిర్వహించిన నీతా అంబానీ కుమారుడి వివాహం సందర్భంగా ఏడు జన్మలు కలిసి ఉండాలి అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక అంబానీ పెళ్లి వేడుకలలో అనంత్ అంబానీ తో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు డాన్సులు వేస్తూ సందడి చేశారు.
అనంత్ అంబానీ వివాహ వేడుకలకు చంద్రబాబు
ఇదిలా ఉంటే ఈరోజు వివాహం తర్వాత నిర్వహించే శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం ముఖేష్ అంబానీ ఇంట ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి చాలామంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో నేడు సాయంత్రం ముఖేష్ అంబానీ కుమారుడి వివాహ వేడుకలకు టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళనున్నారు.
నేడు రాత్రి వేడుకలో పాల్గొననున్న చంద్రబాబు
ఈరోజు సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ముంబైకి వెళుతున్నారు. ఈరోజు రాత్రి చంద్రబాబు ముంబైలోనే బస చేయనున్నారు. మళ్ళీ చంద్రబాబు రేపు మధ్యాహ్నం ఉండవల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు. ముఖేష్ అంబానీ ఇంటి పెళ్లి వేడుకలకు చంద్రబాబు హాజరు కానుండటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తిగా మారింది












Click it and Unblock the Notifications