ఎన్‌టీఆర్ పై సీఎం చంద్రబాబు సంచలన పోస్ట్
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడైన తారకరామారావు సినిమాలలోకి తెరంగేట్రం చేయబోతున్నాడు. వై వి ఎస్ చౌదరి తారక రామారావు కాంబో తో నేడు కొత్త సినిమా ప్రారంభం అయింది. ఈరోజు దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. నందమూరి హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ సినీ ప్రయాణం సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఎన్టీఆర్ పై చంద్రబాబు పోస్ట్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెడుతూ తారక రామారావుకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎన్టీఆర్ గొప్ప విజయాలు అందుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తారకరామారావు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు, తను అన్ని విషయాలలోనూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు పోస్ట్ చేశారు.

Warm wishes to Nandamuri Taraka Ramarao, son of late Shri Janakiram Garu, as he marks his entry into cinema. Wishing him great success as the first look of his debut film is unveiled today. pic.twitter.com/IBSToAP9BR
— N Chandrababu Naidu (@ncbn) May 12, 2025
నేడు సినిమా ప్రారంభ పూజలో భువనేశ్వరి
ఇక మరోవైపు ఈ రోజు పూజా కార్యక్రమానికి నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, మూవీ గారపాటి లోకేశ్వరి, ఎన్టీఆర్ ముగ్గురు కుమార్తెలు హాజరయ్యారు. నారా భువనేశ్వరి హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించి, అభినందించారు. తన తండ్రి సీనియర్ ఎన్‌టీఆర్ నటనలో ఎంత కీర్తి తెచ్చుకున్నారో తారక రామారావు కూడా అలానే ఎదగాలని తమ ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు.
ఎన్టీఆర్ ను స్మరించుకున్న ముని మనవడు ఎన్టీఆర్
మరోవైపు హీరోగా ఎంట్రీ ఇస్తున్న తారకరామారావు కూడా తనము తాత ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. ముత్తాత ఎన్టీఆర్, తాత హరికృష్ణ, నాన్న జానకి రాముల ఆశీస్సులు ఎప్పుడూ తనతోనే ఉంటాయని నమ్ముతున్నానని, ఈరోజు తమ కుటుంబం అంతా తనను ప్రపంచ డానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలు తనను ముందుకు నడిపిస్తారని నమ్ముతున్నానని తారక రామారావు పేర్కొన్నారు.
స్పందించని తారక్
మొత్తానికి ఎన్టీఆర్ కు చంద్రబాబు కూడా శుభాకాంక్షలు తెలిపి, సినిమాలలో రాణించాలని ఆకాంక్షించారు. తాతకు తగ్గ మనవడిగా రాణించాలని కుటుంబం అంతా తారక రామారావును ఆశీర్వదిస్తున్నారు. అయితే తారక రామారావు సినీ ఎంట్రీ పట్ల తారక్ మాత్రం ఇంకా ఏమీ స్పందించలేదు.












Click it and Unblock the Notifications