ఏపీలో ఆ మహిళలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!
ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో అదేవిధంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న చంద్రబాబు, మహిళలు నేరాలకు పాల్పడితే, మహిళలు రౌడీయిజం, గూండాయిజంతో భయపడితే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.
నేరాలలో రెచ్చిపోతున్న వారికి చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చంద్రబాబు ఇచ్చిన సీరియస్ వార్నింగ్ అనేక వ్యవహారాలలో లేడీ డాన్ లుగా వ్యవహరిస్తున్న వారందరికీ హెచ్చరికగా చెప్పవచ్చు. ఇటీవల గత వైసిపి ప్రభుత్వ హయాంలో నేరస్తులు పెరిగి పోయారని, ఆడ, మగ తేడా లేకుండా నేరాలలో అందరూ రెచ్చిపోతున్నారు అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

వాళ్ళ తోక కట్ చేస్తామన్న చంద్రబాబు వార్నింగ్ వైరల్
నెల్లూరు వంటి చోట్ల లేడీ డాన్ లు ఎక్కడైనా చూసామా? ఈ సంస్కృతికి కారణం ఎవరు అని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏపీలో లేడీ డాన్లు పెరిగి పోయారు. వారితోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాస్ వార్నింగ్ అన్ని వర్గాలను ఆలోచించేలా చేస్తుంది.
లేడీ డాన్ల పై చంద్రబాబు సీరియస్
నెల్లూరు జిల్లాలో గతంలో నిడిగుంటి అరుణ స్థానిక వివాదాలలో తలదూరుస్తూ డాన్ గా వ్యవహరిస్తూ చేసినవి చర్చనీయాంశం కాగా ఆమె అరెస్టయింది. తాజాగా కామాక్షమ్మ అనే మహిళ నేర సామ్రాజ్యం వెలుగులోకి రాగా ఇటీవల స్థానికులు ఆమె ఇంటిని కూల్చివేశారు. ఆమె వైసీపీ మద్దతుతోనే ఇదంతా చేస్తుందని పెద్ద ప్రచారం సాగింది. ఇక ఈ పరిణామాలతో సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు.
సోషల్ మీడియాలో కొనసాగుతున్న రచ్చ
మహిళలు అయినా సరే రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. మహిళలకు ఎంత అయితే ప్రాధాన్యతను ఇస్తామో, నేరాలు పాల్పడే వారిపై అదే విధంగా చర్యలు కూడా తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఈ లేడీ డాన్స్ అంతా వైసిపి హయాంలో తయారైన వారే అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ సాగుతోంది. ఏది ఏమైనా ఏపీలో ఏ చిన్న సంఘటన జరిగిన అది సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది.












Click it and Unblock the Notifications