హాస్య నటుడు ఆలీని అక్కున చేర్చుకున్న ఏపి సీఎం..! ఆ పదవిని దాదాపు ఖరారు చేసిన జగన్..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపీ లో నామినేషన్ల పదవుల భర్తీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. పార్టీ కి ఎప్పటినుంచో శ్రేయోభిలాషులుగా ఉన్న నేతలందరిని ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడో, ఏదో పదవిలో అకమాడేట్ చేస్తున్నారు. ప్రస్తుతం హాస్య నటుడు ఆలీని కూడా ఏపి సీఎం అక్కున చేర్చుకున్నారు. తన ప్రియ మిత్రుడు పవన్ కల్యాణ్ ను కాదని, ఆయన ప్రత్యర్థి పార్టీ వైసీపీలో చేరిన అలీకి, తాను ఆశించినట్టుగానే నామినేటెడ్ పదవి దక్కబోతోంది.
Recommended Video

ఆయనకన్నా ముందుగానే పార్టీలో చేరి, గట్టిగా గొంతు వినిపించిన పోసాని కృష్ణమురళికి మాత్రం ఇప్పటివరకూ ఏ పదవీ దక్కలేదు. తనకు మంచి పదవి ఇస్తేనే పార్టీలో చేరతానని జగన్ తో అలీ అన్నట్టు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగింది. ఆయన కోరుకున్నట్టుగానే, జగన్ హామీ ఇచ్చినట్టుగానే మంచి పదవే దక్కబోతోంది. 'ఆంధ్రప్రదేశ్ స్టేట్ పిలిం - టెలివిజన్ - థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్' అధ్యక్షుడిగా అలీని ఏపీ ప్రభుత్వం నియమించనుంది. ఇది ఇప్పటికే ఖరారైంది. రేపోమాపో ఉత్తర్వులు వెలువడతాయి.

ఇదిలా ఉండగా అలీ ఈ పదవిలోకి వచ్చాక సినీరంగ అభివృద్ధి కోసం ఏం చేస్తారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? ఓ సామాజిక వర్గం చేతిలో ఉందని చెప్పే సినీ ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు..? ఇవన్నీ ఇప్పటికి జవాబు లేని ప్రశ్నలే. సినిమా వాళ్లకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదని మొన్న పృథ్వి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం లేపాయో అందరికి తెలుసు. అయినా, జగన్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఓటు వరకు రాజకీయాలు. ఆ తరువాత అన్నీ వ్యూహాలే. సినిమా రంగంలోనూ జగన్ అనే పేరు వినపడాలని...
సినిమా వాళ్లకి ఇస్తున్న పదవులనుబట్టి జగన్ భావిస్తున్నారనుకోవచ్చు. ఏపీలో అన్ని విషయాల్లో తనదైన ముద్ర వేయాలనుకున్న జగన్ ఎవరూ ఎత్తుకోని అంశాలపై కృషి చేస్తున్నారు. ఏపీలో సినీ పరిశ్రమ ఏర్పాటు దిశగా కూడా జగన్ అడుగులు వేస్తున్నారు. అందుకే, పార్టీకి అలీ చేసిన సేవలేమీ లేనప్పటికీ, ఆయనకు తగిన గుర్తింపును ఇచ్చారు జగన్. భవిష్యత్తులో సినిమా రంగం కూడా ఏపీ వైపు చూసేలా జగన్ నిర్ణయాలు ఉంటాయని అమరావతిలో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications