రెడ్లు చీలిపోయి, ఎస్సీల్ని చీలుస్తున్నారు-వారు లెకపోతే గెలవలేను-డిప్యూటీ సీఎం షాకింగ్

ఏపీలో ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రాయలసీమ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి జూలు విదిల్చారు. ఇప్పటికే అధికారంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేస్తున్న ఆయన ఈసారి కూడా వారిని టార్గెట్ చేశారు. ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో చర్చనీయాంశమవుతున్నాయి.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తమ జిల్లాలో రెడ్ల పెత్తనంపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆయన పలుమార్లు రెడ్లను టార్గెట్ చేస్తూనే, తిరిగి వారిని బుజ్జగిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మరోసారి ఆయన రెడ్లను, ఎస్సీలను కలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీలో రెడ్లు రెండు వర్గాలుగా విడిపోయారంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. అలాగే వారు దళితుల్ని, ఎస్సీల్ని కూడా విభజిస్తున్నారంటూ మరో కీలక వ్యాఖ్య చేశారు.

ap deputy cm narayana swamy slams reddys for divided and dividing dalits

చిత్తూరు జిల్లాలో రెడ్ల వర్గపోరుపైనా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్లు విడిపోతున్నారని, ఎస్సీల్ని కూడా విభజిస్తున్నారని, రెడ్లు ఏమైనా చేస్తారంటూ వ్యాఖ్యానించారు. అయితే వారు లేకపోతే తాను గెలవలేనంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రెడ్లు వర్గపోరుకు స్వస్తి చెప్పాలంటూ నారాయణ స్వామి వారిని కోరారు. తద్వారా చిత్తూరు జిల్లాలో రెడ్లు విడిపోవడమే కాకుండా ఎస్సీల్ని కూడా విడదీసి ఇబ్బంది పెడుతున్నారని, వారంతా కలిసిపోతే తప్ప సమస్యకు పరిష్కారం లభించదనే కోణంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగైతేనే తిరిగి తాను గెలవగలననే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

వైసీపీ తరఫున వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న నారాయణ స్వామి డిప్యూటీ సీఎంగా జగన్ తొలి కేబినెట్ లోనే స్ధానం సంపాదించారు. మరోసారి జగన్ కేబినెట్ ప్రక్షాళన చేసినా నారాయణ స్వామి పదవికి ఢోకా లేకుండా పోయింది. అంతే కాదు ఆయన మరోసారి డిప్యూటీ సీఎం పదవిని సైతం నిలబెట్టుకున్నారు. అయితే జిల్లాలో రెడ్ల పోరు మాత్రం ఆయనుకు చికాకు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆయనపై గుర్రుగా ఉన్న రెడ్లు పరోక్షంగా ఆయన్ను టార్గెట్ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+