జగన్ వాహనంలో పవర్‌ఫుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పోలీసుల గౌరవవందనం!!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు విజయవాడలో పర్యటిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతున్న కారణంగా నేడు క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. విజయవాడ పర్యటనలో భాగంగా మొదట గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడినుండి నేరుగా విజయవాడలోని జలవనరుల శాఖ అతిథి గృహం వద్దకు వెళ్లారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పోలీసుల గౌరవ వందనం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అక్కడ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసు సిబ్బంది నుంచి పవన్ కళ్యాణ్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విజయవాడలో తనకోసం ఏర్పాటు చేస్తున్న క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు.

AP deputy CM pawan kalyan used a bullet proof car which is used by former cm ys jagan

జగన్ కారులో ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్
అయితే ఇందులో ఒక విశేషం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో విజయవాడలో పర్యటించిన పవన్ గన్నవరం విమానాశ్రయం నుండి వైఎస్ జగన్ కారులో ప్రయాణించారు. ఈ మాట విని కంగారు పడకండి.. గతంలో సీఎంగా జగన్ ఉన్నప్పుడు ఆయన వినియోగించిన బుల్లెట్ ప్రూఫ్ కారును ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌కు కేటాయించింది. వైప్లస్ సెక్యూరిటీని కూడా ఇచ్చింది.

జగన్ వినియోగించిన బుల్లెట్ ప్రూఫ్ కారు పవన్ కు కేటాయింపు
దీంతో ఈ బుల్లెట్ ప్రూఫ్ కారులో పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడలోని తన క్యాంపు ఆఫీసుకు చేరుకున్నారు. అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించి అవసరమైన మార్పులను కూడా సూచించారు పవన్ కళ్యాణ్. క్యాంప్ కార్యాలయ భవనాన్ని పరిశీలించిన ఆయన బిల్డింగ్ పై అంతస్తులో నివాసం ఉండేలా, కిందఅంతస్తులో ఆఫీసును ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు.

రేపు బాధ్యతల స్వీకరణ నేపధ్యంలో విజయవాడలో పవన్
ఆఫీస్ పక్కనే సమావేశ మందిరం కూడా ఉండడంతో పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రేపు సచివాలయంలో బాధ్యతల స్వీకరణపై చర్చించారు. ఇక అక్కడినుంచి పవన్ కళ్యాణ్ నేరుగా జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. ఈరోజు ఏపీ సచివాలయానికి కూడా వెళ్లి అక్కడ తన పేషీని పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. రేపు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో అధికారులతో చర్చించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+