Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ హామీ నిలబెట్టేందుకు ఏపీ పోలీస్ స్పెషల్ ఆపరేషన్..!

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మాయిలు, మహిళల అదృశ్యంపై తీవ్ర ఆరోపణలు చేసేవారు. ఏకంగా 30 వేల మంది అమ్మాయిలు రాష్ట్రంలో అదృశ్యమైతే అప్పటి సీఎం జగన్ కు చీమకుట్టినట్లు కూడా లేదని ఆరోపించేవారు. అసలు అమ్మాయిల అదశ్యానికి జగన్ సర్కార్ నియమించిన వాలంటీర్లే కారణమని కూడా విమర్శలు గుప్పించారు. దీనిపై నమోదైన కేసును తాజాగా ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో వాలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ పోలీసులు రాష్ట్రంలో అమ్మాయిల అదృశ్యం కేసుల కోసం ఆపరేషన్ ట్రేస్ పేరుతో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. రాష్ట్రంలో తప్పిపోయిన బాలికలను గుర్తించి, వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమంగా ఆపరేషన్ ట్రేస్ ను చేపట్టారు. ఈ మేరకు డీజీపీ హరీష్ గుప్తా ఈ ప్రత్యేక ఆపరేషన్ ను ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను కూడా ఆయన విడుదల చేశారు.

ap dgp launch operation trace to keep pawan kalyan s election promise

ఈ ఆపరేషన్ ట్రేస్ ను ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ రూపంలో అమలు చేయనున్నట్లు డీజీపీ హరీష్ వెల్లడించారు. బాలికల అపహరణలు, తప్పిపోవడాలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఆగష్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ ను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం పూర్తి సమన్వయంతో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమంలో పాల్గొంటుందన్నారు. కుటుంబాల నుండి దూరమైన బాలికలను గుర్తించి, వారికి అవసరమైన సహాయం అందించి, తిరిగి వారి కుటుంబాల వద్దకు చేర్చడమే ఆపరేషన్ ట్రేస్ లక్ష్యం" అన్నారు.

ఈ ఆపరేషన్ ట్రేస్ (Operation Trace) కు అబ్రివేషన్ కూడా ఇచ్చారు. ట్రేస్ లో టీ అంటే ట్రేస్, ఆర్ అంటే రీకనెక్ట్, ఏ అంటే అసిస్ట్, సీ అంటే కౌన్సెల్, ఈ అంటే ఎంపవర్ అని డీజీపీ వెల్లడించారు. ఇందులో భాగంగా ముందుగా తప్పిపోయిన బాలికల్ని గుర్తించడం, సమస్యాత్మక ప్రదేశాలలో మహిళా పోలీసులతో నిఘా ఏర్పాటు చేయడం, కాపాడిన బాలికలను వారి కుటుంబాలతో కలిపి తాత్కాలిక నివాసం ఏర్పాటు చేయడం, సంబంధిత చైల్డ్ వెల్ఫేర్ కమిటీలను సమన్వయ పరచటం, త్వరితగతిన వారికి మెడికల్ కేర్, ఆహారం, వసతి, దుస్తులు, న్యాయసలహాలు అందించడం చేస్తారు.

అలాగే వారికి వయస్సు నిర్ధారణ పరీక్షలు, గుర్తింపుకు సంబంధించిన పత్రాలను రూపొందించడం, వారిపై ఆకృత్యాలు జరిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం,ఎన్జీవోల ద్వారా ద్వారా కౌన్సిలర్స్ ని నియమించి బాధిత బాలికలకు మానసిక సంబంధమైన సమస్యలకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం చేస్తారు. అలాగే వారికి చదువు, స్కిల్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్ , ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందిస్తారు.

ఆగష్టు ఒకటి, రెండవ తేదీల్లో డేటా కలెక్షన్ కోసం జిల్లా , సబ్- డివిజన్ స్థాయిలో టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు చేయడం, 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎన్డీవోలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాల తనిఖీలు, వీరిపై నమోదైన కేసుల్ని తిరిగి పరిశీలించడం, వయసు తెలుసుకోవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో, ప్రార్ధనా స్థలాల్లో, రెడ్ లైట్ ఏరియాలలో ప్రత్యేక తనిఖీల ద్వారా తప్పిపోయిన బాలికలను గుర్తించడం, ప్రజల భాగస్వామ్యంతో ఫైండ్ హర్ (FIND HER) కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

ap dgp launch operation trace to keep pawan kalyan s election promise

అలాగే శక్తి యాప్ లో రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్ ఫీచర్ ద్వారా తప్పిపోయిన పిల్లల కోసం ఫిర్యాదు చేసేలా ప్రోత్సహిస్తారు. తప్పిపోయిన పిల్లల సమాచారాన్ని 112 నెంబర్ కి ఫోన్ చెయ్యడం ద్వారా లేదా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కి, ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181కి మరియు శక్తి వాట్స్ యాప్ నెంబర్ 7993485111కు సమాచారం ఇవ్వడం ద్వారా సహాయం పొందవచ్చు. రాష్ట్రంలోని అన్ని జిల్లా యూనిట్లలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి ప్రాధాన్యతగా చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+