వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AP EAMCET 2021 Schedule విడుదల-ఆగస్టు 19-25 మధ్య పరీక్షలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎంసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇవాళ షెడ్యూల్‌ ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకూ ఎంసెట్‌లోని వివిధ విభాగాల పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 25వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే ఇంజనీరింగ్‌, మెడికల్, అగ్రికల్చర్ విద్యార్ధులు ఈ నెల 26 నుంచి జూలై 25 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జూలై 26 నుంచి ఆగస్టు 5 వరకూ రూ.500 ఆలస్యపు ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 6 నుంచి 10 వరకూ ఐదు రోజుల పాటు వెయ్యి రూపాయల ఆలస్యపు ఫీజుతో దరఖాస్తులు తీసుకుంటారు. ఆగస్టు 11 నుంచి 15 వరకూ 5000 రూపాయల ఆలస్యపు ఫీజుతో అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 16 నుంచి 18 వరకూ రూ.10 వేల ఆలస్యపు ఫీజుతో దరఖాస్తులు తీసుకుంటారు.

AP EAMCET 2021 schedule released- exams from august 19 to 25

ఎంసెట్‌తో పాటు మిగతా పోటీ ప్రవేశ పరీక్షలైన ఈసెట్, ఐసెట్, పీజీ సెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీసెట్‌లను ఈ ఏడాది సెప్టెంబర్‌ నెల ఒకటి, రెండో వారాల్లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిపికేషన్లు విడుదల చేస్తారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గడంతో వరుసగా ప్రవేశపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎంసెట్‌ షెడ్యూల్ విడుదల కాగా..మిగిలిన పరీక్షల షెడ్యూల్‌లను త్వరలో విడుదల చేయబోతున్నారు.

English summary
andhrapradesh government on today release schedule for AP EAMCET 2021. as per the schedule exams will be conducted from august 19 to 25 this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X