ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. స్త్రీశక్తి సిగపట్ల పథకం (వీడియో)!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం పట్ల మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ఈ పథకాన్ని తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం జీరో టికెట్ పైన మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది.
ఫ్రీ బస్సులలో తెగ తిరిగేస్తున్న మహిళలు
ఫ్రీ బస్సులలో ఎక్కడికి వెళ్లాలన్నా రయ్ రయ్ మంటూ సులభంగా ప్రయాణాలు చేసేస్తున్నారు మహిళలు . చూడాలనుకున్నవి , తిరగాలి అనుకున్నవి చక చక తిరిగేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఏపీలో బస్సులలో మహిళల ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. వీరి ప్రయాణ సౌకర్యానికి ఆర్టీసీ అదనంగా బస్సులను సైతం ఏర్పాటు చేయవలసిన పరిస్థితి వచ్చింది.

సీట్ల కోసం మహిళల సిగపట్లు
మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా బస్సులలో పురుషులు ఇబ్బంది పడుతున్నారు. పురుషులు మాత్రమే కాదు మహిళలు సైతం ఉచిత బస్సు ప్రయాణంతో నానా తిప్పలు పడుతున్నారు. బస్సులలో సీట్లకోసం మహిళల మధ్య ఫైటింగ్ పరిపాటిగా మారింది. ఉచిత బస్సు పథకం ప్రారంభించిన నాటి నుంచే సీట్లకోసం మహిళలు సిగపట్లు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణాల సమయంలో మహిళలు కొట్టుకుంటున్న అనేక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పెనుగంచిప్రోలు ఆర్టీసీ బస్సులో మహిళల కొట్లాట
తాజాగా ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో చోటుచేసుకుంది.పెనుగంచిప్రోలు లోని తిరుపతమ్మ అమ్మవారి దేవాలయానికి భారీగా భక్తులు వెళుతున్న క్రమంలో పెనుగంచిప్రోలు నుండి విజయవాడ బయలుదేరిన ఆర్టీసీ బస్సులో 60 మంది ప్రయాణికులు ఎక్కారు. వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) September 14, 2025
ఫ్రీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో ఘటన
సీటు విషయంలో ఇరువురు మహిళల మధ్య వాగ్వాదం
ఒకరి పై ఒకరు దాడి చేసుకున్న మహిళలు pic.twitter.com/fGn4HyVDgZ
బస్సు పోలీస్ స్టేషన్ కు పోనివ్వాలని ప్రయాణికుల అసహనం
సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ చిలికి చిలికి గాలి వానగా మారి వాటర్ బాటిల్స్ తో కొట్టుకునే దాకా వెళ్ళింది. ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ దాడులు చేసుకోవడంతో బస్సులోని మిగతా ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. బస్సులో మహిళల గొడవను ఆపటానికి కండక్టర్ ఎంత ప్రయత్నం చేసినా ఆయనను నెట్టేసి మరీ కొట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులో ఇంత గొడవ జరుగుతున్నా బస్సు డ్రైవర్ బస్సు ఆపలేదు.
మహిళలు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
ప్రయాణికులు కొందరు లేచి నిలబడి బస్సును పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లవలసిందిగా కోరారు. దీంతో మహిళల గొడవ సద్దుమణిగింది. బస్సులో మహిళలు కొట్టుకున్న వీడియోను తీసిన సోషల్ మీడియాలో పెట్టడంతో అది సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. దీంతో ఇప్పుడు ఏపీలో ఉచిత బస్సు పథకం తీసుకు వస్తున్న తిప్పల పైన చర్చ జరుగుతోంది. ఏపీ బస్సు ప్రయాణ సిగపట్ల పథకం అని ఇది చూసిన వారు సెటైర్లు వేస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications