Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్- సుప్రీంకోర్టుకు బంతి..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఇవాళ మరో షాక్ తగిలింది. ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసుల పాలై జైలు జీవితం అనుభవిస్తున్న ఆయనకు తాజాగా హైకోర్టులో ఊరట లభించింది. అయితే దీనిపై గుర్రుగా ఉన్న ఏపీ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వల్లభనేని వంశీకి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.

కృష్ణాజిల్లాలో అక్రమ మైనింగ్‌ కు పాల్పడిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గతంలో హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు వంశీకి ఊరటనిచ్చింది. అయితే మిగతా కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ జైల్లో ఉన్న వంశీ జైలు నుంచి బయటికి వచ్చే పరిస్ధితి లేకుండా పోయింది. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు మాత్రం హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో వంశీ చికిత్స తీసుకున్నారు.

ap government accord permission to challenge hc verdict vallabhaneni vamsi bail in supreme court

ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టు గతంలో వంశీకి ఇచ్చిన ఊరటపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు అనుమతి మంజూరు చేస్తూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో జారీ చేసారు. దీంతో ప్రభుత్వం త్వరలో సుప్రీంకోర్టులో ఈ మేరకు అప్పీలు పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో వంశీ విషయంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+