ఏపీలో ఒంటిపూట బడుల ప్రకటన-సమయాలివే-ఎప్పటి నుంచో తెలుసా ?

ఏపీలో ఒంటిపూట బడులపై నెలకొన్న వివాదానికి తెరపడింది. వేసవిలోకి ప్రవేశించినా ఇంకా స్కూళ్లకు ఒంటిపూట సెలవులు ప్రకటించకపోవడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ స్పందించింది. విజయవాడలో మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒంటిపూట బడులపై ఓ ప్రకటన చేశారు. ఎండలు ఎక్కువగా లేవని కారణంతో ఒంటి పూట బడులు పెట్టలేదని మంత్రి బొత్స తెలిపారు. అలాగే ఉదయం 7.45 నుంచి 12.30 వరకూ మాత్రమే బడులు ఉంటాయన్నారు.

రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లూ ఈ మేరకు 3వ తేదీ నుంచి ఒంటిపూట బడుల నిర్వహణకు సిద్ధం కావాలని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు ఈ ఉత్తర్వులను ధిక్కరించి బడులు నడిపితే చర్యలు తప్పవని బొత్స హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో విద్యార్ధులకు ఒంటిపూట మాత్రమే స్కూళ్లు నడిపేలా అధికారుల్ని ఆదేశించామన్నారు. ఒంటిపూట బడులపై ప్రశ్నించిన టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలపై స్పందించిన బొత్స.. టీచర్లపై ఎలాంటి కోపం లేదన్నారు.

ap government announces half day schools from april 3, minister botsa says no anger on teachers

మరోవైపు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపైనా బొత్స స్పందించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బొత్స వెల్లడించారు. ఈ పరీక్షలకు ఉదయం తొమ్మిదిన్నర దాటితే అనుమతించబోమని స్పష్టం చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్ధితుల్లో విద్యార్ధుల్ని అనుమతించే అధికారం అధికారులకు ఇచ్చామన్నారు. 3344 సెంటర్లలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బొత్స వెల్లడించారు. 6 లక్షల 9 వేల 70 మంది ఈసారి పరీక్షలు రాస్తున్నారన్నారు.పదో తరగతి విద్యార్ధులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోతే అధికారుల్ని సంప్రదిస్తే ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+