యార్లగడ్డ రాజీనామాకు ఆమోదం - పునరాలోచన లేదు..!!

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడుగా యార్లగడ్డ వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చుతూ వైఎస్సార్ పేరు జత చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయన తన పదవికి రాజీనామా చేసారు. ఎన్టీఆర్ తో పాటుగా నందమూరి కుటుంబంతో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ కు సత్సంబంధాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం పైన పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది.

టీడీపీతో సహా ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. వైఎస్ షర్మిల కూడా పేరు మార్పు నిర్ణయం సరి కాదని వ్యాఖ్యానించారు. అయితే, ముఖ్యమంత్రి జగన్.. ఏపీ మంత్రులు అసెంబ్లీలో - బయటా పేరు మార్పుకు కారణాలను వెల్లడించారు. అదే సమయంలో 1995లో ఎన్టీఆర్ ను పదవీచ్యుతిడిని చేసి చంద్రబాబు సీఎం అయ్యే సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపైన వైసీపీ టీడీపీ అధినేతను టార్గెట్ చేసింది. ఇక..ఆ సమయంలో రాజీనామా చేసిన యార్లగడ్డ సీఎం జగన్ హీరో అంటూ ప్రశంసించారు. కానీ, ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం మాత్రం సమర్ధించలేదు.

AP Government Approves AP Official language Pannel Chairman Yarlagadda resignation

నాడు ఎన్టీఆర్ కు భారత రత్న కోసం తాము నాటి ప్రధాని వాజ్ పేయ్ ను కలిసిన సమయంలో చంద్రబాబు కారణంగానే ఇవ్వలేదని స్పష్టం చేసిన అంశాన్ని ఆయన వెల్లడించారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ నివాసంలో నాడు చోటు చేసుకున్న కాల్పులు.. వైఎస్సార్ వద్ద చోటు చేసుకున్న చర్చల గురించి యార్లగడ్డ వివరించారు. ఇక, ఇప్పుడు ఆయన చేసిన రాజీనామా విషయంలో పునరాలోచన చేస్తారా.. సీఎం ఆమోదిస్తారా..తిరస్కరిస్తారా అనే చర్చ చోటు చేసుకుంది. కానీ, యార్లగడ్డ తన రాజీనామాకే కట్టుబడి ఉన్నారు. దీంతో.. ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+