Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకంపై కీలక అప్డేట్- ముహుర్తం ఫిక్స్..! స్టేటస్ చూసుకోండిలా..!

ఏపీలో కూటమి సర్కార్ మరో కీలక సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకునేందుకు సిద్దమైంది. ఏడాదిగా రైతులు ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ ( annadata sukhibhava scheme) పథకం అమలు కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ అధికారులు కీలక వివరాలను వెల్లడించారు. ఈ పథకం ఎప్పుడు అమలయ్యే అవకాశం ఉంది, పథకానికి అర్హులు ఆన్ లైన్ లో స్టేటస్ ఎలా చూసుకోవాలి, ఎంత మొత్తం విడుదల కాబోతోందన్న వివరాలను ప్రకటించారు.

అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బుల్ని రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నెలలో, 2026 జనవరిలో రెండు విడతలుగా వీటిని విడుదల చేస్తారు. సొంత భూమి కలిగిన పట్టాదారులు, ఇనాం భూములు, అసైన్డ్ భూముల రైతులను కూడా ఈ పథకాికి అర్హులుగా గుర్తించినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. వెబ్ ల్యాండ్ లో ఆధార్ జత చేయకపోయినా, వివరాలు తప్పుగా ఉన్న రైతులు రెవెన్యూ అధికారిని సంప్రదించి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

ap government clarified annadata sukhibhava scheme amount release other details

అలాగే భూమిలేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు మాత్రం ఈ-పంటలో తమ పేరు నమోదు చేసుకోవడంతో పాటు గుర్తింపు కార్డు పొందాలని ఢిల్లీ రావు తెలిపారు. కేంద్రం వాటా నిధులు రాగానే, కూటమి ప్రభుత్వం కూడా తమ వాటాతో కలిపి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా రెండు విడతల్లో పది వేల చొప్పన మొత్తం 20 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈకేవైసీతో పాటు ఇతర కార్యక్రమాల్ని ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు..

అన్నదాత సుఖీభవ పథకానికి మొత్తం 47.77 లక్షల మంది లబ్దిదారుల్ని గుర్తించారు. వీరిలో 98 శాతం మందికి ఈకేవైసీ పూర్తయిందని, మరో 60 వేల మందికి మాత్రం త్వరలో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం వర్తింపు, ఈకేవైసీ వంటి వివరాలు చెక్ చేసుకోవడానికి ప్రత్యేకంగా పోర్టల్ ను ప్రారంభించనున్నారు. https://annadathasukhibhava.ap.gov.in/ అడ్రస్ తో వెబ్ సైట్ ప్రారంభిస్తారు. దీనిపై క్లిక్ చేయగానే హోం పేజ్ లోనే నో యువర్ స్టేటస్ ఆప్షన్ ఉంటుందని, దాన్ని క్లిక్ చేసి ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలని అధికారులు సూచించారు. తర్వాత సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే స్టేటస్ కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేటస్ అప్రూవుడ్ అని కనిపిస్తే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+