ఏపీలో సచివాలయాల ఉద్యోగుల బదిలీలు-సర్కార్ మార్గదర్శకాలివే..!
ఏపీలో ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియకు కూటమి సర్కార్ తాజాగా తెరదీసింది. ఈ మేరకు రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీనికి అనుగుణంగా రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఎలా చేపట్టాలో ఇందులో వివరించింది.
ప్రభుత్వం రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 19 నుంచి 31 వరకూ సడలించింది. దీని ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ బదిలీ కోరుకుంటున్న ఉద్యోగులు అధికారిక వెబ్ సైట్ లోని తమ లాగిన్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఖాళీల జాబితాను విధిగా వీరికి సచివాలయాల వెబ్ సైట్లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది.

ఇలా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు చేసుకున్న ఆన్ లైన్ దరఖాస్తుల్ని కలెకర్లు డౌన్ లోడ్ చేసుకుని వాటిని పరిశీలించాలి. వాటిని ప్రాధాన్య కేటగిరీల వారీగా విభజించాలి. బదిలీల కౌన్సిలింగ్ కు ముందే సీనియార్టీ, మెరిట్ ఆధారంగా ఆయా దరఖాస్తుల్ని విభజించుకోవాలి. ఆగస్టు 31వ తేదీ లోగా ప్రభుత్వం ఇచ్చిన ఎస్వోపీ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది.
పాలనా కారణాలు ఉంటే ఏ ఉద్యోగినైనా తప్పనిసరి బదిలీ చేసే అధికారం కూడా కలెక్టర్లకు ఉంటుంది. అలాగే ఏసీబీ, విజిలెన్స్ కేసులున్న ఉద్యోగుల బదిలీలు చేపట్టకూడదు. ఏ బదిలీ అయిన ఉద్యోగికీ టీటీఏ కానీ మరే ఇతర ప్రయోజనం కూడా లభించదు. ఏ ఉద్యోగినీ తమ స్థానిక గ్రామ, వార్డుల్లో పోస్టింగ్ ఇవ్వకూడదు. నాన్-ఐటీడీఏ ప్రాంతాలతో పోలిస్తే ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీ చేసే ఉద్యోగులు 50 ఏళ్లలోపు వారే ఉండేలా చూసుకోవాలి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications