యువతకు చంద్రబాబు భారీ కానుక... రూ.50వేల వేతనంతో ఉద్యోగాలు

ప్రస్తుతం నడుస్తున్నది సోషల్ మీడియా యుగం. అరచేతిలో ఫోన్.. అందులో ప్రపంచం ఇమిడిపోవడంతో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. పక్కవారితో మాటలకన్నా చేతిలో ఫోన్ పట్టుకొని అందులో విషయాలను తెలుసుకోవడానికే అందరూ ప్రాధాన్యతనిస్తున్నారు. అంతటి ప్రాధాన్యత ఉన్న సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు ఎలా ఉపయోగించుకుంటున్నాయో మనం చూస్తున్నాం. ఒకరకంగా పార్టీ విజయాలకు కూడా ఇవి కారణమవుతున్నాయి.

సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల పేషీల్లో కొత్త సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ లను నియమించాలని నిర్ణయించింది. అలాగే వీరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లను కూడా నియమించనుంది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీసీ) ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 మంది ఎగ్జిక్యూటివ్ లను, 24 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లను తీసుకోబోతున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంపిక చేసి నెలకు రూ.50వేల వేతనం ఇస్తారు. వీరికి అర్హతగా బీటెక్ లేదా బీఈని ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లకు అర్హత డిగ్రీ ఉండాలి. వీరికి వేతనం నెలకు రూ.30వేలు ఇస్తారు.

AP Government released notification for the recruitment of Social Media Executives and Assistants

ప్రమోషన్ చేసే విధానం తెలవాలి
డిజిటల్ కంటెంట్ విషయంలో అనుభవం ఉండటంతోపాటు వాటిని ప్రమోషన్ చేసే విధానం కూడా తెలిసి ఉండాలి. ఆయా శాఖలకు చెందిన మంత్రుల పోర్ట్ ఫోలియోకు సంబంధించి కార్యకలాపాలపై ప్రచారం చేయాలి. ప్రభుత్వ ఇమేజ్ ను పెంచేలా, ప్రజల్లో మంచి పేరు వచ్చేలా కంటెంట్ ను రూపొందించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీలోగా తమ రెజ్యూమేను [email protected] మెయిల్ కు పంపించాలి. హాట్ సూట్ పై పనిచేసిన అనుభవంతోపాటు గూగుల్ అనలిటిక్స్, ఫేస్ బుక్, డిజిటల్ బ్లాగర్ ఫ్లాన్, ఫ్రీలాన్స్ లాంటి అనుభవం ఉండాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం https://www.apdc.ap.gov.in/ , I&PR వెబ్‌సైట్ http://ipr.ap.gov.in/ వెబ్ సైట్లను సంప్రదించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+