ఏపీ స్కూళ్లకు అకడమిక్ క్యాలెండర్ రిలీజ్-టైమింగ్స్, సెలవులు, పరీక్షలు ఇలా..!
ఏపీలో పాఠశాలలకు ప్రభుత్వం కొత్త విద్యాసంవత్సరం సందర్భంగా అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ విద్య సంవత్సరంలో ఎన్ని పని దినాలు ఉండబోతున్నాయి, ఎన్ని సెలవులు ఇస్తున్నారు, పాఠశాలల టైమింగ్స్, పరీక్షలు ఇలా అన్ని వివరాలను ఇందులో పొందుపరిచారు. ఈ క్యాలెండర్ ప్రకారం విద్యాసంవత్సరంలో పాఠశాలలు పనిచేయాల్సి ఉంటుంది. అకస్మికంగా ప్రకటించే సెలవులు ఇందుకు అదనం.
ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 315 రోజులుండగా.. ఇందులో 233 పని దినాలు, 82 సెలవులున్నాయి. అలాగే ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 వరకూ పనిచేయనుండగా.. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు సాయంత్రం 4 గంటల వరకూ పనిచేస్తాయి. దసరా సెలవులు అక్టోబర్ 4 నుంచి 13 వరకూ ఇస్తారు.

క్రైస్తవ మైనార్టీ పాఠశాలలకు మాత్రం దసరా సెలవులు అక్టోబర్ 11 నుంచి 13 వరకూ దసరా సెలవులు ఉంటాయి. అలాగే క్రైస్తవ మైనార్టీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి 29 వరకూ ఇస్తారు. మిగతా అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకూ ఇస్తారు. అలాగే 1 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్ధులకు పరీక్షల షెడ్యూల్స్ ను కూడా అకడమిక్ క్యాలెండర్ లో ప్రకటించారు.
అన్ని తరగతులకు ఫార్మాటివ్ 1 పరీక్షలు ఆగస్టు 1 నుంచి 5 వరకూ నిర్వహిస్తారు. ఫార్మాటివ్ 2 పరీక్షలు సెప్టెంబర్ 26 నుంచి 30 వరకూ నిర్వహిస్తారు. సమ్మెటివ్ 1 పరీక్షలు నవంబర్ 1 నుంచి 15 వరకూ, ఫార్మాటివ్ 3 పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 6 వరకూ నిర్వహిస్తారు. 10వ తరగతి విద్యార్ధులకు ప్రీఫైనల్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 20 వరకూ నిర్వహిస్తారు. ఫార్మాటివ్ 4 పరీక్షలు మార్చి 3 నుంచి 6 వరకూ, సమ్మెటివ్ 2 పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి 18 వరకూ నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications