Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Google: గూగుల్ తో ఏపీ సర్కార్ ఒప్పందం-స్కూళ్లలో పిల్లలకు ఏఐ ట్రైనింగ్..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. వీటి ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విద్యార్ధులకూ నైపుణ్యాల శిక్షణ కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ గూగుల్ తో విద్యామంత్రి నారా లోకేష్ మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీ విద్యార్ధులకు అవకాశాలు అందించేలా ఈ ఒప్పందం చేసుకున్నారు.

ఎఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఇవాళ కీలక ఒప్పందం కుదిరింది. గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ గూగుల్ క్లౌడ్ ఇండియా ఎండీ బిక్ర‌మ్ సింగ్ బేడీ, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ సచివాలయంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం అంతర్జాతీయంగా ఎఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలో స్కూల్లు , కాలేజీల్లో గూగుల్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీంతోపాటు స్టార్టప్ లు, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది.

ap government to tie-up with google for AI based Skill training in schools

ఏఐ ఆధారిత వ్యవస్థలో ఆర్థిక వృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణ, వనరులను యువతకు అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించడం గూగుల్ ఉద్దేశం. దీంతోపాటు ఏఐ రంగంలో ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు గూగుల్ సహకారాన్ని అందిస్తుంది. పాలన వ్యవస్థలో ఏఐ వాడకం ద్వారా ప్రజలకు వేగంగా మెరుగైన సేవలు అందించాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనా విధానానికి అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకుంటున్నామని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ బిక్ర‌మ్ సింగ్ బేడీ, గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి తెలిపారు.

ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ విధానమని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. దైనందిక జీవితంలో ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల సర్టిఫికేట్లు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అందుబాటులో ఉండే సెల్ ఫోన్ వంటి సాధనం ఆయా సేవలను అందుబాటులోకి తేవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యువతకు ఎఐ ఆధారిత భవిష్యత్ అవకాశాలను కల్పించేందుకు గూగుల్ సంస్థ ఎపి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ఈ ఒప్పందంతో విద్య, నైపుణ్యాభివృద్ధి: విద్యార్థులు, డెవలపర్లకు ఎఐ ఆధారిత నైపుణ్యాల కోసం 10వేలమందికి గూగుల్ ఎసెన్షియల్ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అందిస్తారు. రోజువారీ జీవితంలో ఏఐని ఎలా వాడుకోవాలి, ఎఐ ద్వారా ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచడం వంటివి ఈ కోర్సులో అంతర్భాగంగా ఉంటాయి. సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ జనరేటివ్ ఏఐ వంటి రంగాల్లో గూగుల్ క్లౌడ్ సర్టిఫికేషన్‌లు, స్కిల్ బ్యాడ్జ్‌లను గూగుల్ ఇస్తుంది. ప్రభుత్వ ఏజెన్సీల కోసం స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను అందించడానికి గూగుల్ క్లౌడ్ సహకరిస్తుంది. కంప్యూటర్ సైన్స్ విద్యకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఫ్యాకల్టీకీ గూగుల్ సాంకేతిక మద్దతును ఇస్తుంది. స్కిల్లింగ్ ఇనిషియేటివ్‌లలో గూగుల్ డెవలపర్ కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లు, ఆండ్రాయిడ్, యాప్ స్కిల్లింగ్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్‌లకు గూగుల్ ద్వారా యాక్సెస్ లభిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+