వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాలు జారీ..!!
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రక్రియను ఈ నెల 15లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా, అంతర జిల్లా స్థాయిల్లో బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను, బదిలీల ప్రక్రియ షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. బదిలీ విదివిధానాలు..అమలు చేయాల్సిన ప్రక్రియను అందులో స్పష్టం చేసారు. మార్గదర్శ కాలకు అనుగుణంగా వ్యవహరించాలని సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీషా సూచించారు.
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియ విధి విధానాలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు జిల్లా, అంతర జిల్లా స్థాయిల్లో బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను, బదిలీల ప్రక్రియ షెడ్యూల్ ఉత్తర్వులను విడుదల చేశారు. వికలాంగులకు, మానసిక, మందబుద్ది సమస్యలతో వును పిల్లలను కలిగి వును ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యతను ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమస్యలకు సంబందించిన సర్టిఫికెట్‌లను ఎంపిడిఓ గానీ, మునిసిపల్ కమిషనర్ గాని స్వయంగా పరిశీలించి కౌంటర్ సిగుేచర్‌తో కలెక్టర్‌కు నివేదించాలని పేర్కొన్నారు. సర్టిఫికేషన్ ప్రక్రియను ఈ నెల 10లోపు పూర్తి చేయాలని తెలిపారు. మే నెల 28 నాటికి ఉను ఖాళీల ఆధారంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్దేశించారు.

ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇదే నెల 15న కలెకర్టకు ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో జరిగే బదిలీలకు ఈ నెల 10లోపు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాలి. ఏదైనా కారణాలతో దరఖాస్తులు తిరస్కరణకు గురయితే ఈ నెల 12న మండల కార్యాలయాల వద్ద జాబితాను ప్రదర్శించాలి. 14, 15 తేదీల్లో కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. అదే విధంగా..అంతర జిల్లాల బదిలీల ప్రక్రియకు దరఖాస్తులను ఈ నెల 9లోపు పంపుకోవాలి. ఈ మేరకు వచ్చిన ప్రతిపాదనలను ఇదే నెల 10న రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి పంపాలి. 13న పరిశీలన జరిపి ఆయా జిల్లాలకు సర్క్యులర్‌లను పంపుతుంది. ఈ నెల 14, 15 తేదీలలో బదిలీలకు సంబంధించి ప్రొసీడింగ్స్‌ను జారీ చేస్తారు.
-
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!











Click it and Unblock the Notifications