టి అధికారి ఏపీ సైట్‌ హ్యాక్ చేశారా?: ‘కాపీ’విచారణకు బాబు సర్కారు నిర్ణయం!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఇటీవల తెరపైకి వచ్చిన'కాపీ' వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. 'ఈజ్ ఆఫ్ డూయిగ్ బిజినెస్ (ఈఓడీబీ)'కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కారు అప్ లోడ్ చేసిన సమాచారం మొత్తం తాము రూపొందించే అని ఆరోపిస్తున్న తెలంగాణ సర్కారు.. చంద్రబాబు సర్కారు తమను కాపీ కొట్టిందని ఆరోపించింది.

ఏపీ 'కాపీ'కిదే సాక్ష్యం, తప్పును కూడా వదల్లేదు: కెటిఆర్(ఫొటోలు)

అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలో తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందున్న తాము గత సంవత్సరం రెండో స్థానంలో ఉన్నామని చెబుతున్న ఏపీ సర్కారు... ఇతరులను కాపీ కొట్టాల్సిన అవసరం లేదని ఏపీ వాదిస్తోంది.

AP govt on EODB Copy issue

ఈ నేపథ్యంలో అసలు తాము అప్ లోడ్ చేసిన సమాచారం తమకు కాకుండా ఇతర రాష్ట్రాలకు తెలిసే అవకాశం లేదన్న కొత్త వాదనను ఏపీ ప్రస్తావించింది. తమ వెబ్‌సైట్‌లోకి అనధికారికంగా చొరబడిన వ్యక్తులకే ఈ సమాచారం తెలుస్తుందని కూడా వాదిస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణకు చెందిన అధికారులు తమ వెబ్‌సైట్‌లోకి చొరబడ్డారని, ఇది ముమ్మాటీకీ హ్యాకింగేనని ఏపీ సర్కారు భావిస్తోంది. ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణకు దాదాపుగా నిర్ణయం తీసుకున్న ఏపీ... గురువారం సదరు విచారణకు సంబందించి ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh governmentt responded on EODB Copy issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి