చంద్రబాబుకి పోటీగా అల్లు అర్జున్ ర్యాలీ..! రిటైర్డ్ ఐపీఎస్ కు ఏపీ సర్కార్ షాక్..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ప్రస్తుతం రెండో సంవత్సరం పాలన కొనసాగుతోంది. అయినా గత వైసీపీ ప్రభుత్వంలో తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన అధికారుల్ని టార్గెట్ చేసే విషయంలో మాత్రం సీఎం చంద్రబాబు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఇదే క్రమంలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిపై ఇవాళ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారుల్ని కూడా నియమిస్తూ జీవో జారీ చేసింది.
2024 ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ఆయన స్నేహితుడు, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్రచారానికి వచ్చారు. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా తన స్నేహితుడు శిల్పా రవి కోరిక మేరకు ఆయన కోసం ప్రచారం చేసేందుకు అల్లు అర్జున్ నంద్యాల వచ్చారు. అదే సమయంలో నంద్యాలలో విపక్ష నేత చంద్రబాబు ర్యాలీ కూడా ఉంది. దీనికి పోటీగానే అల్లు అర్జున్ ను వైసీపీ ప్రభుత్వం రప్పించిందనే అరోపణలు వచ్చాయి.

అప్పటి జగన్ ప్రభుత్వ ఆదేశాలతో నంద్యాల ఎస్పీగా ఉన్న రఘవీర్ రెడ్డి చంద్రబాబును కాదని అల్లు అర్జున్ ర్యాలీకి అనుమతించారు. అయితే అల్లు అర్జున్ ను చూసేందుకు భారీ సంఖ్యలో జనం ఎగబడ్డారు. దీంతో ఈ వ్యవహారంపై ఈసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లు అర్జున్ తో పాటు ఈ ర్యాలీకి అనుమతించిన పోలీసులపైనా కేసులు నమోదుచేయాలని ఆదేశించింది. దీంతో అప్పట్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్ హైకోర్టుకు వెళ్లి ఊరట తెచ్చుకున్నారు.

కానీ అప్పటి ఎస్పీ రఘువీర్ రెడ్డిపై మాత్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. రఘువీర్ రెడ్డిపై అప్పట్లో వచ్చిన ఆరోపణలపై విచారణకు ఇంటెలిజెన్స్ ఐజీ పీహెచ్‌డీ రామకృష్ణను విచారణాధికారిగా నియమించింది. అలాగే అనంతపురం డీఐజీ షిముషిని ప్రజెంటింగ్ ఆఫీసర్ గా నియమించారు. రఘువీర్ రెడ్డిపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సీఎస్ విజయానంద్ ఇవాళ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!











Click it and Unblock the Notifications