AP Govt: సీఎంఎఫ్ఎస్ లో బిల్లులకు సర్కార్ డెడ్ లైన్..! వీరికి మినహాయింపు..!
ఏపీలో 2025-26 ఆర్దిక సంవత్సరానికి సంబంధించిన బిల్లుల్ని సీఎఫ్ఎంఎస్ లో సమర్పించేందుకు ప్రభుత్వం (ap govt) తాజా డెడ్ లైన్ ఇచ్చింది. అలాగే ఈ డెడ్ లైన్ నుంచి ఎవరెవరికి మినహాయింపు ఇస్తున్నారో కూడా వివరించింది. వారు తప్ప మిగిలిన వారంతా తమ బిల్లుల్ని సీఎంఎఫ్ఎస్ పోర్టల్ లో నిర్ణీత గడువులోగా అప్ లోడ్ చేయాలని కోరింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఇవాళ ఓ మెమో జారీ చేసింది.
ట్రెజరీలో బిల్లుల సకాల సమర్పణను నియంత్రించడానికి, 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేయబడిన రాబడికి అనుగుణంగా వ్యయాన్ని నియంత్రించడానికి, 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తును సక్రమంగా సిద్ధం చేయడానికి, సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బిల్లుల సమర్పణకు వచ్చే నెల 10వ తేదీని గడువుగా నిర్ణయించింది. అలాగే ఈ డెడ్ లైన్ నుంచి ఎవరెవరికి మినహాయింపు ఇచ్చారో కూడా వెల్లడించింది. హెచ్ ఆఫ్ అకౌంట్స్ 010, 020, 040, 060, 070, 130/134, 200/208, 200/209, 240/241, 280, 290, 300, 310/311, 370, 450, 560/561కు ఈ గడువు నుంచి మినహాయింపు ఇచ్చారు.

వీటితో పాటు రుణ సేవ బిల్లులు (Loan Servicing Bills), జీపీఎఫ్, ఏఫీజీఎల్ఐ, కాంటింజెన్సీ ఫండ్, గౌరవ వేతనం, కార్పొరేషన్ల జీతాల బిల్లులు, చట్టపరమైన చెల్లింపులకు సంబంధించిన బిల్లులు (ఐటి, జిఎస్‌టి, APSDC (ARET) మొదలైనవి),స్థానిక సంస్థలు (FC గ్రాంట్లు, CASP, NABARD, EAP, మినరల్ డెవలప్‌మెంట్ ఫండ్‌తో సహా) తమ సొంత నిధులకు సంబంధించిన బిల్లులకు మాత్రం ఈ గడువు నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే రాజ్‌భవన్, ఛార్జ్‌డ్ ఎక్స్‌పెండిచర్ (నిర్బంధ వ్యయం), ప్రకృతి వైపరీత్యాలు, డిక్రీ చార్జీలు & కోర్టు/చట్టపరమైన అంశాలకు సంబంధించిన చెల్లింపుల బిల్లులన్నీ ఈ ఆంక్షల నుండి మినహాయించబడ్డాయి. డీటీఏ, పీఏఓ, సీఈవో, ఏఫీసీఎఫ్ఎస్ఎస్ ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications