ఆవకాయ అమరావతి ఉత్సవాలు.. ఏపీలో సంక్రాంతికి సూపర్ ఫెస్టివల్స్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగ ఏదైనా ఉత్సవాలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏపీలో టూరిజాన్ని ప్రోత్సహించడం కోసం టూరిజం శాఖ ప్రత్యేక దృష్టిని సారించింది. ఇందులో భాగంగా సంక్రాంతి పండుగకు ముందు ఆవకాయ అమరావతి ఉత్సవాలు పేరుతో విజయవాడలో మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించడానికి రెడీ అయింది.

జనవరి 8నుండి 10వరకు ఆవకాయ అమరావతి ఉత్సవాలు
జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. భవాని ద్వీపం, పున్నమి ఘాట్ ఈ ఉత్సవాలకు వేదికగా మారాయి. రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి టీం వర్క్ ఆర్ట్స్ ఈ మూడు రోజుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనుంది. ఇక ఈ వేడుకలకు ప్రవేశాన్ని పూర్తిగా ఉచితం చేయడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు అన్న అంచనా ఉంది.

AP govt to Host Avakaya Amaravati Utsavalu in Vijayawada from January 8 to 10

ఆవకాయ అమరావతి ఉత్సవాలతో వివిధ కళారూపాల ప్రాముఖ్యత చాటి చెప్పే ప్లాన్
ఆవకాయ అమరావతి ఉత్సవాలు వివిధ కళారూపాల ప్రాముఖ్యతను చాటిచెప్పేలా రూపొందించారు. నృత్యం, కవిత్వం, సంగీతం, సినిమా వీటితోపాటు ఫుడ్ ఫెస్టివల్, వర్క్ షాప్స్, సాహిత్య చర్చలు, ఘాట్ ఫెర్రీ ప్రయాణాలు వంటి అనేక కార్యక్రమాలతో రూపొందించారు. ఆసక్తి ఉన్న ప్రేక్షకులు ఈ ఉత్సవాలను ఆన్లైన్లో చూడ్డానికి అధికారిక వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

ఉత్సవాలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు , తొలిరోజు ఇలా
ఈ ఉత్సవాలలో భాగంగా జనవరి 8వ తేదీ సాయంత్రం గురువారం నాడు పున్నమి ఘాట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. తొలి రోజు తోలుబొమ్మల ఊరేగింపు, తీన్మార్ డప్పుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. జామ్మర్స్ సంగీత ప్రదర్శన, పున్నమి ఘాట్ వద్ద నిర్వహించే హారతి, హౌస్ బోట్ ప్రారంభోత్సవం, శంఖం, నగారా, డ్రమ్స్ ప్రదర్శనలతో మొదటి రోజు కార్యక్రమాలు ముగుస్తాయి.

రెండోరోజు కార్యక్రమాలు ఇలా
రెండవ రోజు భవాని ద్వీపంలో కార్యక్రమాలు ఉంటాయి. సినిమాలలో విలన్ పాత్ర పై ఆసక్తికర చర్చగోష్టి నిర్వహిస్తారు. ఇందులో యండమూరి వీరేంద్రనాథ్, ఎస్ హుస్సేన్ జైది, సుధీర్ మిశ్రా వంటి ప్రముఖులు పాల్గొంటారు. ఆ తర్వాత భారతీయ పురాణాలు పురోగమనం అనే అంశంపైన కస్తూరి మురళీకృష్ణ, సంజీవ్ పస్రిచా, అనురాధ మోతాలి తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఇక ఓటిటి కాలంలో సినిమాలపైన పడే ప్రభావాన్ని కూడా పలువురు వక్తలు ప్రసంగిస్తారు.

AP govt to Host Avakaya Amaravati Utsavalu in Vijayawada from January 8 to 10

ఒకటి కాదు, రెండు కాదు.. బోలెడు ఈవెంట్స్
చర్చ గోష్టులు మాత్రమే కాదు, మార్షల్ ఆర్ట్స్, బొమ్మల తయారీ, నగాడా వాద్యం, నృత్యం వంటి కళల పైన వర్క్ షాప్ లు, సదస్సులు ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం పున్నమి ఘాట్లో కర్ణాటక సంగీత ప్రదర్శన, కూచిపూడి నృత్య నాటకం నిర్వహించనున్నారు. ఆపై సినిమాలో సంగీతం, కవిత్వం పైన చర్చలు జరుగుతాయి. అనిరుద్ వర్మ కలెక్టివ్, నిజామి బంధు సంగీత బృందాలు ప్రదర్శనలు చేస్తాయి.

మూడోరోజు కార్యక్రమాలు ఇలా
ఇక చివరి రోజైన జనవరి 10వ తేదీ శనివారం భవాని ద్వీపంలో తెలుగు కథా కళ, సినిమా- జర్నలిజం, తెలుగు సాహిత్యం- సినిమా వైభవం, అనువాద కళలపైన చర్చ గోష్టులు నిర్వహిస్తారు. ఇక చివరిగా పున్నమి ఘాట్ లో ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ 'చౌరస్తా' సంగీత కచేరి తో సందడి చేస్తారు. అంతేకాదు ప్రేమ కథ సంగీత నాటకం, జావేద్ అలీ సంగీత కచేరి, ఎన్టీఆర్ నటన విశ్వరూపానికి ప్రత్యేక నివాళి కార్యక్రమంతో మూడు రోజుల ఆవకాయ అమరావతి ఉత్సవాలు ఘనంగా ముగుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+