పథకాల నిధుల విడుదలలో బిగ్ ట్విస్ట్ - కోర్టు అనుమతించినా..!!
ఏపీలో పోలింగ్ సమయం సమీపిస్తోంది. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నిధల విడుదల పైన కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో నిధుల విడుదల పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. దీంతో, పోలింగ్ పూర్తయిన తరువాత నిధులు విడుదల చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీని పైన లబ్ది దారులు హైకోర్టుకు వెళ్లగా ఈ ఒక్క రోజులో నిధుల విడుదలకు అనుమతి దక్కింది. కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్ తెర మీదకు వచ్చింది.
హైకోర్టు తీర్పుతో
ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటైన సమయం నుంచి పథకాలు అమలు చేస్తున్నారు. నిర్దేశిత క్యాలెండర్ మేరకు పథకాల లబ్దిదారులకు నిధులు విడుదల చేస్తున్నారు. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పథకాల నిధులకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధుల విడుదల పైన ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాయి. దీంతో..పోలింగ్ పూర్తయిన తరువాత లబ్ది దారుల ఖాతాల్లో నిధులు విడుదల చేయాలంటూ పథకాల అమలు కు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. దీని పైన పథకాల లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈసీ వద్దకు ప్రభుత్వం
విచారణ సమయంలోనూ ఎన్నికల సంఘం 13వ తేదీ పోలింగ్ పూర్తయిన తరువాత నిధులు పంపిణీ చేసుకోవచ్చని చెప్పింది.లబ్దిదారులు, ప్రభుత్వ వాదనలు విన్నతరువాత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. ఈ ఒక్క రోజులోనే ఎలాంటి ఆర్భాటం లేకుండా నిధులు పంపిణీకి అనుమతి ఇచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాల పైన ఒక్క రోజు స్టే విధించింది. 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పథకాల నిధుల విడుదలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. దీంతో, కోర్టు తీర్పుకు అనుగుణంగా నిధుల విడుదల అంశం పైన ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది.
నిధుల విడుదలపై ఉత్కంఠ
కానీ, ఎన్నికల సంఘం నుంచి ఇంకా పథకాల నిధుల విడుదలకు సంబంధించి కోర్టు తీర్పుకు అనుగుణంగా అనుమతి రావాల్సి ఉంది. ఈసీ నుంచి నిర్ణయం మరింత ఆలస్యం అయితే కోర్టు నిర్దేశించిన సమయం ముగిసిపోతుందని లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు కోర్టు తీర్పు పైన ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుందీ.. అనుమతి దక్కుతుందా..న్యాయ పరంగా ఇతరత్రా అంశాలు ఏమైనా తెర మీదకు వస్తాయా..ఈ రోజు విడుదల అవుతాయని భావిస్తున్న పథకాల నిధులు ఖాతాల్లో జమ అవుతాయా..ఏం జరుగుతందనే ఉత్కంఠ ఎన్నికల కీలక సమయంలో అటు రాజకీయంగానూ..ఇటు లబ్ది దారుల్లోనూ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications