Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫొటో వివాదం-హైకోర్టు కీలక తీర్పు..!

ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు ఫొటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటో కూడా పెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఫొటోలతో సమానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోల్ని కూడా రాష్ట్ర సచివాలయంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని ఉత్తర్వులు ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది.

రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి వై.కొండలరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రముఖుల చిత్రపటాల ప్రదర్శన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం అమల్లోకి తెచ్చే వరకూ ప్రస్తుతం ఆఫీసుల్లో పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ ఫొటో తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.

AP High Court Dismisses PIL Against Pawan Kalyan s Photo Display in Offices

దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రాథమిక ఆధారాలను బట్టి పిటిషన్ కు విచారణ అర్హత లేదని భావిస్తూ హైకోర్టు ఈ ప్రజాప్రయోజన వాజ్యాన్ని తోసిపుచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు చేయకూడదని నిషేధం ఎక్కడ ఉందని పిటిషనర్ ను హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది.

ఈ ప్రజా ప్రయోజన వాజ్యం కేవలం రాజకీయ దృష్టితో, ఉద్దేశపూర్వకంగా దాఖలైందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రజా ప్రయోజనాల కోసం అయితే చట్టబద్ధంగా కోర్టును ఆశ్రయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కానీ ఇక్కడ సమాజానికి మేలు చేసే నిజమైన ప్రజా ప్రయోజన వాజ్యాలపై తాము దృష్టి సారిస్తామని పిటిషనర్ కు తేల్చిచెప్పింది. అలాగే తమ రాజకీయ లక్ష్యాల్ని నెరవేర్చుకోవడం కోసం కోర్టులను వేదికగా మార్చే ప్రయత్నాలు చేయొద్దని ధర్మాసనం హెచ్చరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+