ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితం -ఓట్ల లెక్కింపునకు హైకోర్టు ఓకే -ఇక నీలం సాహ్నిదే ఆలస్యం
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగిసి రెండు నెలల తర్వాతగానీ ఏలూరు కార్పొరేషన్ ఫలితంపై ఉత్కంఠ వీడలేదు. వివాదాల కారణంగా ఫలితాల వెల్లడిని వాయిదా వేసిన హైకోర్టు ఎట్టకేలకు ఓట్ల లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఏపీ హైకోర్టు అంగీకారం తెలిపింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ లెక్కింపునకు అనుమతించింది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సిద్ధమయ్యారు. కోర్టు ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత కౌంటింగ్ ఎప్పుడు నిర్వహించాలనేదానిపై ఎస్ఈసీ స్పష్టత ఇస్తారు.

ఏలూరు పరిధిలోని వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అక్రమాలు, గందరగోళ పరిస్థితి కారణంగా ఎన్నికను నిలిపేయాలంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం మొదలైంది. మొత్తంగా ఎన్నికను నిలిపేయాలని సింగిల్ జడ్జి ఆదేశించగా, దానిని కొట్టేస్తూ, ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. తాజాగా
ఏలూరు కార్పొరేషన్ ఫలితంపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు.. ఓట్ల లెక్కింపునకు పచ్చజెండా ఊపింది. లెక్కింపుపై ఇక ఎస్ఈసీ నిర్ణయమే తరువాయి. మార్చి నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం తెలిసిందే. మొత్తం 12 కార్పొరేషన్లకుగానూ 11 చోట్ల, 75 మున్సిపాలిటీలకుగానూ 74చోట్ల వైసీపీ విజయం సాధించింది. ఏలూరు కార్పొరేషన్ లోనూ గెలుపు తమదేనని అధికార పార్టీ ధీమాగా ఉంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications