ఏపీలో రేపటి నుంచి మద్యం షాపుల బంద్-కారణమిదే..!
ఏపీలో మద్యం షాపులు రేపటి నుంచి మూత పడబోతున్నాయి. కూటమి ప్రభుత్వం త్వరలో తెస్తున్న ఎక్సైజ్ పాలసీతో తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనతో ఉన్న మద్యం షాపుల ఉద్యోగులు నిరసన తెలిపేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో ఇలా షాపులు మూసేసి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఉద్యోగ సంఘం అడుగులు వేస్తోంది.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు రంగంలో ఉన్న మద్యం షాపుల్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో భారీ ఎత్తున తాత్కాలిక ఉద్యోగుల్ని నియమించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీరిని తొలగించి ప్రైవేటుకు షాపులు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలో ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మద్యం షాపుల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది.

గత ప్రభుత్వం తమను పత్రికా ప్రకటన ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమించిందని, కానీ కనీస వేతనం కూడా సమయానికి అందించలేదని తమకి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఓటీలు కూడా ఏజెన్సీలు తినేశాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయినా తమకు మంచి రోజు లు వచ్చాయని ఆశ పడ్డామని వారు చెప్తున్నారు. కానీ ప్రభుత్వమే మద్యం దుకాణాలు ప్రైవేట్ పరం చేసి తమను రోడ్డున పడేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆవేదనతో నిరసనకు సిద్ధమయ్యారు. తమ ఉద్యోగాల విషయంలో సీఎం చంద్రబాబు పునరాలోచించాలని వారు కోరుతున్నారు.
-
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
Half-Day Schools: ఏపీలో ఒంటిపూట బడులు-ఎప్పటి నుంచి అంటే ? టైమింగ్స్ ఇవే..! -
రైతులకు శుభవార్త: ఏపీలో రేపటి నుండి "రైతన్న మీ కోసం".. చంద్రబాబు ఆదేశం! -
ప్రభుత్వ ఆస్పత్రులలోనూ వాట్సప్ ద్వారా ఓపీ అపాయింట్మెంట్లు.. పేదలకు చంద్రబాబు శుభవార్త! -
నిరుద్యోగులకు ఉగాది కానుక, 10వేల ఉద్యోగాలు భర్తీ- ఏ శాఖలో ఎన్ని..!! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
Job Calendar: ఏపీలో జాబ్ క్యాలెండర్ ఖరారు? ఇవాళ సర్కార్ కీలక భేటీ..! -
ఏపీలో ఫీజురీయింబర్స్ మెంట్ పై గుడ్ న్యూస్..! సర్కార్ కీలక నిర్ణయం..! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు












Click it and Unblock the Notifications