AP Local Body Elections: స్థానిక ఎన్నికల షెడ్యూల్ పై ఎస్ఈసీ క్లారిటీ..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల (local body elections)నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడంతో పాటు వాటిపై ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఆ తర్వాత ఏకంగా స్దానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రభుత్వం విడుదల చేసినట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్, వివరాలతో పోస్టర్లు కూడా దర్శనమిస్తున్నాయి. దీంతో స్థానిక ఎన్నికల్లో పోటీ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతల్లో గందరగోళం మొదలైంది.

కూటమి ఆ ఒక్క నిర్ణయం వైసీపీకి ఊపిరి పోస్తుందా ? చరిత్ర ఏం చెబుతోంది ?
కూటమి ఆ ఒక్క నిర్ణయం వైసీపీకి ఊపిరి పోస్తుందా ? చరిత్ర ఏం చెబుతోంది ?

అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి (state election commission)కి కూడా రోజూ భారీ సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. దీంతో ఎన్నికల సంఘం దీనిపై క్లారిటీ ఇస్తూ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న స్థానిక సంస్దల షెడ్యూల్ ఫేక్ అని తేల్చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు జరగనున్న 2వ సాధారణ ఎన్నికలకు సంబంధించిన తేదీలు, షెడ్యూళ్లతో కూడిన తప్పుడు, తప్పుదారి పట్టించే వార్తలు, సమాచారం వాట్సాప్ ద్వారా ప్రచారం జరుగుతున్నట్లు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.

AP Local Body Elections State Election Commission Responds to Schedule Circulating on Social Media
AP SIR: ఏపీలో 'సర్' పై ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి 28 ఐఏఎస్ లు..!
AP SIR: ఏపీలో 'సర్' పై ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి 28 ఐఏఎస్ లు..!

ఈ సమాచారం ఎన్నికల సంఘం అధికారిక అనుమతి లేకుండా అధికారిక చిహ్నాలను ఉపయోగించి ప్రచారం చేస్తున్నట్లు గమనించినట్లు తెలిపారు. దీంతో ప్రచారంలో ఉన్న సమాచారం నిజమైనదా కాదా అనే విషయంపై వివరణ కోరుతూ వివిధ వర్గాల నుంచి కమిషన్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. కానీ ఈ సమాచారం ఫేక్ అన్నారు. ప్రజలు ఇలాంటి ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని లేదా ఇతరులకు షేర్ చేయవద్దని కోరారు. తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించే, ప్రచారం చేసే లేదా వ్యాప్తి చేసే వ్యక్తులపై వర్తించే సైబర్ చట్టాలు/నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించిన ఏదైనా నిజమైన మరియు అధికారిక సమాచారం కమిషన్ అధికారిక పత్రికా ప్రకటన/సమావేశం ద్వారా మాత్రమే ప్రజలకు తెలియజేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+