లోకేష్ కు కొడాలి సవాల్-అవును టెన్త్ తప్పి ఎమ్మెల్యేనయ్యా-గుడివాడలో నన్ను ఓడించు..

పదో తరగతి కూడా పాస్ కాని వారు సభలో రెచ్చిపోతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలినానిని తాకాయి. దీంతో ఆయన ఇవాళ లోకేష్ కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు.

టెన్త్ క్లాస్ కూడా చదువుకోని వాళ్లంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. తాను టెన్త్ నాలుగుసార్లు తప్పానని, కానీ గుడివాడలో ఎమ్మెల్యేగా గెలిచానని కొడాలి నాని తెలిపారు. లోకేష్ కు దమ్ము ఉంటే గుడివాడలో వచ్చి పోటీ చేసి గెలువు చూస్తా అని కొడాలి సవాల్ విసిరారు. లోకేష్ కు ఏమీ తెలుసని ఆయన ప్రశ్నించారు. అమెరికాలో చదివి మంగళగిరిలో ఓడిపోయాడంటూ ఎద్దేవా చేశారు. లోకేష్, చంద్రబాబు సిగ్గు లేని వ్యక్తులంటూ కొడాలి విరుచుకుపడ్డారు.

ap minister kodali nani challege nara lokesh to win in gudivada, say 10th failed 10th win

మరోవైపు అసెంబ్లీ 12 రోజుల సమావేశంలో చంద్రబాబును సీఎం జగన్ ఒక్క మాట కూడా తూల లేదని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థలోకి దూరితే నష్టం ఏర్పడుతుందని హైకోర్టు తీర్పుపై నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చపై కొడాలి స్పందించారు. సభకు చట్టం చేసే హక్కు ఉందని చెప్పారు. తాము ఎక్కడా న్యాయ వ్యవస్థను కించపరచలేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ కోరిక ప్రకారం జగన్ విశాఖపట్నం వెళ్లి మళ్ళీ అధికారంలోకి వస్తారని కొడాలి తెలిపారు. టిడిపికి ప్రతిపక్ష హోదా కుడా రాదన్నారు. టీడీపీ జాతీయ పార్టీ అని చెప్పుకోవడంపై కొడాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై తాను ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తానని కొడాలి తెలిపారు. టీడీపీ జాతీయ పార్టీ అని ఎన్నికల కమిషన్ చెప్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని కొడాలి మరో సవాల్ విసిరారు. కాదంటే చంద్రబాబు తప్పుకుంటాడా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+