పవన్ కామెంట్స్ అల్లు అర్జున్ పైనేనా ? నాదెండ్ల క్లారిటీ..!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలో చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఏనుగుల సమస్య పరిష్కారం కోసం కర్నాటకలో దొరికే కుమ్కీ ఏనుగులు తెచ్చేందుకు ఇవాళ బెంగళూరు వెళ్లారు. అక్కడి మంత్రి ఈశ్వర్ తో ఈ సమస్యపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో అడవుల నరికివేతపై చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా అల్లుఅర్జున్ ను ఉద్దేశించి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
కన్నడ కంఠీర రాజ్ కుమార్ నటించిన 'గంధద గుడి' సినిమాలో అటవీ పరిరక్షణ గురించి చెబుతుందని, అడవులకు రక్షణగా ఉండే డి.ఎఫ్.ఓ.పాత్రను హీరోగా ఆ చిత్రంలో చూపారని పవన్ బెంగళూరులో తెలిపారు. ఇప్పుడు సినిమాల్లో ఆ తీరు మారిందని, అడవులు కొట్టేవారు హీరోగా కనిపిస్తున్నారంటూ తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగగా నటించిన అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసినవే అన్న వాదన వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. పవన్ వ్యాఖ్యలపై జరుగుతున్న ప్రచారంపై మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎవరిపై కామెంట్స్ చేయరని తెలిపారు. చెట్లు పెంచితే సమాజానికి మంచిది అనేది పవన్ కల్యాణ్ ఆలోచన అని క్లారిటీ ఇచ్చారు. తద్వారా పవన్ చేసిన కామెంట్స్ కేవలం అడవుల నరికీవేతపై మాత్రమేనని, అల్లు అర్జున్ నో, మరొకరినో ఉద్దేశించి కాదని పార్టీ నాయకులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications