ఏపీలో యూత్ కు లోకేష్ గుడ్ న్యూస్..! 3 వేల పథకంపై కీలక ప్రకటన..!
ఏపీలో నిరుద్యోగ యువతకు విద్యామంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. యువగళం పాదయాత్రలో వారికి ఇచ్చిన ఓ కీలక హామీపై అంతే కీలక ప్రకటన చేశారు. ఈ హామీని ఎప్పటి నుంచి నిలబెట్టుకుంటున్నారో ఆయన తాజాగా మచిలీపట్నంలో జరిగిన టీడీపీ కార్యకర్తల భేటీలో వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున అందించే ఈ పథకం అమలుకు రంగం సిద్దమవుతోంది.
గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసిన నారా లోకేష్ ఆ సమయంలో తనను కలిసిన నిరుద్యోగ యువతకు ఓ హమీ ఇచ్చారు. అదే నిరుద్యోగ భృతి. రాష్ట్రంలో పెద్ద చదువులు చదివి కూడా ఉద్యోగాలు లేకుండా అల్లాడుతున్న నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అనంతరం దాన్ని కూటమి మ్యానిఫెస్టో కూడా పెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయినా ఈ పథకం ఇంకా అమలు కాలేదంటూ విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

బందరులో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ భృతి పథకాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాల్ని ఈ ఏడాదే వరుసగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఇక నిరుద్యోగ భృతి కూడా అమలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే లోకేష్ ఈ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేసి నెలకు 3 వేల చొప్పున నిరుద్యోగ యువతకు సాయం అందించనున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications