Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?

ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ దాఖలవుతున్న నామినేషన్లలో రాజకీయ నేతల ఆస్తులు, అప్పులు, కేసుల గురించే చర్చ జరుగుతుంటే.. ఏపీ మంత్రి ఆర్కే రోజా తాజాగా దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో మాత్రం ఓ ఆసక్తికరమైన అంశం కనిపించింది.

అదేంటంటే మంత్రి రోజాకు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ లో ఓ చిట్ ఉన్నట్లు తేలింది.

ap minister rk roja has a chit in margadarsi- revealed in election affidavit

మరోసారి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆర్కే రోజా నిన్న ఎన్నికల నామినేషన్ తో పాటు తన ఆస్తులు, అప్పుల వివరాలతో అఫిడవిట్ కూడా సమర్పించారు. ఇందులో రోజాకు మొత్తం 4.58 కోట్ల చరాస్తులు ఉన్నట్లు తేలింది. అలాగే 6.05 కోట్ల స్ధిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో రోజా తనకు ఆరు కార్లు ఓ బైక్ ఉన్నట్లు చెప్పగా.. ఈసారి 9 కార్లు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. వీటితో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్ లో తనకు ఓ చిట్ ఉన్నట్లు వెల్లడించారు.

తనకు మార్గదర్శి చిట్ ఫండ్స్ లో ఎల్టీ0330వీ ఎంఏ/48 నంబరుతో రూ.39.21 లక్షల విలువైన చిట్ ఉన్నట్లు ఆర్కే రోజా తన ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు. మరో ప్రైవేటు చిట్ లో తనకు రూ.32.90 లక్షల చిట్ ఉన్నట్లు తెలిపారు. అయితే ఇందులో ఎలాంటి వివాదం లేకపోయినా వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా మార్దదర్శి చిట్స్ అక్రమాలపై పలు కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేసింది. ఇలాంటి తరుణంలో రోజా మార్గదర్శిలో ఇంకా చిట్ కొనసాగిస్తుండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+