కొడాలి భాషలో తప్పేముంది ? ఈగ వాలితే సహించబోం- మంత్రి రోజా కామెంట్స్

అమరావతి : ఏపీలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ను ఉద్దేశించి వాడుతున్న భాషపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొడాలి నాని తీరుపై మండిపడుతున్న టీడీపీ శ్రేణులు కృష్ణాజిల్లాలో నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి భాషను మంత్రి రోజా ఇవాళ సమర్ధించారు.

చంద్రబాబుపై కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు చేపడుతున్న నిరసనల్ని మంత్రి రోజా ఇవాళ తప్పుబట్టారు. కొడాలి నాని భాషలో తప్పేముందని ఆమె ప్రశ్నించారు. ఆయన పై ఈగ వాలితే సహించేది లేదన్నారు.
టీడీపీ నేతలు రౌడీయుజం చేస్తూ ఇళ్ళపై దాడి చేస్తారా అని మంత్రి రోజా ప్రశ్నించారు. రాంగ్ రూట్ లో ఎమ్మెల్సీ అయిన లోకేష్ సీఎం జగన్ పై అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలతో కొట్టిస్తామంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ap minister rk roja supports kodali nanis language against opposition, assure protection

రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని మంత్రి రోజా అన్నారు. టీడీపీ గ్రామాల్లో తిరిగితే ఎంత మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుందన్నారు. మూడు రాజధానుల బిల్లు పెట్టే దమ్ము ప్రభూత్వనికి ఉందా అని టీడీఎల్పీ సమావేశం లో చర్చించారని మంత్రి రోజా తెలిపారు. ప్రజల మద్దతు ఉండబట్టే మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావన చేస్తోందన్నారు. అందుకే రాజధాని ప్రాంతం సహా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందన్నారు. చంద్రబాబు వెనుక ఎంతమంది ఎమ్మల్యేలు ఉన్నారో తెలుసా అని రోజా ప్రశ్నించారు. మూడు రాజధానుల ప్రస్తావన వస్తే వైసీపీ ఎమ్మెల్యే లు ఎందుకు రాజీనామా చేయాలని ఆమె నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+