AP Ministers: చంద్రబాబు శాఖల కేటాయింపుపై మంత్రులేమన్నారంటే ?

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. అనంతరం ఇవాళ మంత్రులకు చంద్రబాబు శాఖలు కూడా కేటాయించారు. కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్తూ ట్వీట్లు పెడుతున్నారు. అలాగే మంత్రులను అభినందిస్తూ చంద్రబాబు కూడా ట్వీట్లు చేస్తున్నారు.

ముందుగా కేబినెట్లో డిప్యూటీ సీఎంగా నియమితులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇందులో ఆయనతో పాటు మిగతా మంత్రులకూ అభినందనలు తెలిపారు. " ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయిన తరువాత గారూ. మంత్రివర్గంలోని నా సహోద్యోగులందరికీ వారికి పోర్ట్‌ఫోలియోలు కేటాయించినందుకు నేను అభినందిస్తున్నాను. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తామని, ప్రజా పాలన శకానికి నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా మీరు మా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తారని నాకు నమ్మకం ఉంది. సేవ మరియు భక్తితో కూడిన ఈ యాత్రను ప్రారంభించిన మీ అందరికీ నా శుభాకాంక్షలు." అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ap ministers reacted to ministries allotment- here is who said what

ఏపీ కేబినెట్లో కీలకమైన ఆర్ధిక, ప్రణాళిక, శాసనసభావ్యవహారాల మంత్రిగా నియమితులైన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ముందుగా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్తూ ట్వీట్ చేశారు. అనంతరం ఆరోగ్యశాఖ మంత్రిగా నియమితులైన బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ కూడా ట్వీట్ చేశారు. ఇందులో ఆయన చంద్రబాబుతో పాటు బీజేపీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే బీజేపీ కూడా ఆరోగ్యమంత్రిగా నియమితులైన సత్యకుమార్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది.

అలాగే రెవెన్యూ మంత్రిగా నియమితులైన అనగాని సత్యప్రసాద్ కూడా ట్వీట్ చేశారు. తనపై నమ్మకంతో రెవెన్యూ మంత్రిగా అవకాశం కల్పించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనగాని ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి గా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను. ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాను. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నాను. రాష్ట్రానికి ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+