నెల్లూరు టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు-వైసీపీ నేతల చేరికల వేళ షాకింగ్..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీల్లో ప్రజా ప్రతినిధుల ఫిరాయింపులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీకి పదికి పది సీట్లు అందించిన జిల్లా అయిన నెల్లూరులో తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో ఇవాళ విపక్ష టీడీపీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తూ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ చేశారనే సమాచారంతో పోలీసులు ఈ తనిఖీలు చేపడుతున్నారు.

ఇవాళ ఉదయం నుంచీ మాజీ మంత్రి పొంగూరు నారాయణతో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతల ఇళ్లకు చేరుకున్న పోలీసులు సోదాలు ప్రారంభించారు. 15 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారన్న సమాచారంతోనే ఈ దాడులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు సోదాలు చేస్తున్న టీడీపీ నేత విజిత రెడ్డి నివాసానికి చేరుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు.

ap police raids nellore tdp leaders houses at 15 locations including narayana others

ఇవాళ నెల్లూరు జిల్లాలో పోలీసులు సోదాలు చేస్తున్న నివాసాల్లో ప్రధానంగా మాజీ మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే వీరికి ఆర్ధిక సాయం అందిస్తున్న ఫైనాన్షియర్ల ఇళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని టార్గెట్ చేయడం ద్వారా జిల్లాలో టీడీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా పార్టీ మారడంతో టీడీపీ పట్టు పెరుగుతోంది. ఈ సమయంలో పోలీసుల దాడులు చర్చనీయాంశమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+