సంక్రాంతి పండుగకు సిద్ధమైన ఏపీకి వరుణుడి షాక్? అక్కడ వర్ష భయం!
సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాలు ముస్తాబయ్యాయి. తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు సంక్రాంతి పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో సంక్రాంతి రోజులలో ఏపీపై వరుణుడు దాడి చేయడానికి సిద్ధమైనట్టు భారత వాతావరణ శాఖ ప్రకటనతో ఊహించని షాక్ తగిలింది.
ఏపీలో వర్షాలు పడే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రజలకు పండుగ వేళ కూడా వాన గండం తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

వాతావరణ శాఖ ప్రకటనలతో ప్రజల్లో ఆందోళన
జనవరి 12వ తేదీ నుంచి వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ప్రకటనలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అయితే వర్షాలపైన ఎటువంటి హెచ్చరికలు లేవని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉన్న కారణంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఈశాన్య, తూర్పు గాలుల ప్రభావంతో ఆవర్తనం మరింత బలపడుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
ఈ రాష్ట్రాలలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదుకు చాన్స్
ఈ గాలుల వేగం గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉందని కూడా పేర్కొంది. అత్యధికంగా గంటకి 55 కిలోమీటర్ల వేగం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక దీని ప్రభావంతో ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏపీలో పండుగ వేళ వర్షాల ఆందోళన
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీ లోను, యానాం లోను గాలులు అధికంగా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తంగా పండుగ వేళ ఏపీలో వర్షాలు కురుస్తాయి అన్న వార్తలతో పండుగ ఎలా జరుగుతుందో అన్న గందరగోళం ప్రజలలో నెలకొంది.












Click it and Unblock the Notifications