ఏపీకి రెండు తుఫాన్ల తీవ్ర హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాకాలం పూర్తయి చలికాలం సమీపిస్తున్నప్పటికీ వర్షాలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

అక్టోబర్ లో రెండు తుఫాన్లు
ఈ అక్టోబర్ నెలలో అరేబియా సముద్రంలోనూ, బంగాళాఖాతంలోనూ రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అలాగే ఉత్తర కేరళ దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకు ద్రోణ విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ap rains update Two cyclones giving solid warning to AP rains in these district

ఏపీలో వర్షాలు ఈ జిల్లాలలోనే
దీని ప్రభావంతో మంగళవారం ఏపీలోని పది జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ నెలలో ఏర్పడే రెండు తుఫానుల కారణంగా ఏపీలోని పలు జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈనెల 10వ తేదీ తర్వాత ఏపీలోని కోస్తా జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రేపు ఈ జిల్లాలలో వర్షాలు
ఇక మంగళవారం నాడు అల్లూరి సీతారామరాజు, మన్యం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్య సాయి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రేపు ఈ జిల్లాలలో తేలికపాటి వర్షాలు
అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కోనసీమ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పలు జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిశాయ.

నేడు ఈ జిల్లాలలో కురిసిన వర్షాలు
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణ ,ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో నేడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ నెలలోనూ ఏపీని వర్షాలు వదిలే అవకాశం కనిపించడం లేదని ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+