ఏపీని వదిలి పోలేనంటున్న బంగాళాఖాతం.. వారికి తీవ్ర హెచ్చరిక!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు, కేరళ తీరంలో కొనసాగుతున్న ద్రోణి, అలాగే అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావంతో ఏపీలో రాబోయే ఐదు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఏపీలో నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు
ముఖ్యంగా కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఇక ఈరోజు ఉత్తరకోస్తాలోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణ, బాపట్ల తదితర జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గంటకి 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

AP rains updates heavy rains in these districts in ap today IMD serious warning

ఈ జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
ఇది ఇలా ఉంటే ఈరోజు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, చిత్తూరు, గుంటూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి, అన్నమయ్య , కడప జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

నిన్న ఏపీలో వర్షాలు ఇక్కడే
నిన్న ఏపీలోని పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నంద్యాల, కర్నూలు, కడప తదితర జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. ఇక ఏపీలో అత్యధికంగా నిన్న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో 55.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

కృష్ణా వరదలు... తీర ప్రాంతాల ప్రజలకు అలెర్ట్
ఇదిలా ఉంటే ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతుంది. కృష్ణా నది వరద ప్రవాహం పెరగడంతో వివిధ ప్రాజెక్టుల నుండి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్ లోనూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణ నది పరివాహక ప్రాంత ప్రజలు , లంక గ్రామాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం 1070,112 మరియు 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+