Dussehra Holidays: ఏపీలో దసరా సెలవుల ప్రకటన- ఈసారి బోనస్ గా మరో 2..!

ఏపీలో ఈ ఏడాది పాఠశాలలకు (AP Schools ) దసరా సెలవులపై (Dussehra Holidays) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి దసరా సెలవుల షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే దీనికి అదనంగా మరో రెండు రోజులు కూడా సాధారణ సెలవులు రాబోతున్నాయి. దీంతో విద్యార్ధులకు పండగే అని చెప్పవచ్చు. ప్రభుత్వం తాజా ప్రకటన ప్రకారం వచ్చే నెల అంటే అక్టోబర్ 12 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పాఠశాలలకు సమాచారం ఇస్తున్నారు.

మమ్మల్ని ఫేక్ అంటారా ? డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల ఫైర్..!
మమ్మల్ని ఫేక్ అంటారా ? డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల ఫైర్..!

వాస్తవానికి అక్టోబర్ 12 నుంచి 21వ తేదీ వరకూ సెలవులు ఇస్తుండగా.. అంతకు ముందే 10వ తేదీన రెండో శనివారం, 11వ తేదీన ఆదివారం వస్తున్నాయి. దీంతో అక్టోబర్ 10 నుంచే పాఠశాలలకు సెలవులు మొదలుకాబోతున్నాయి. అక్కడి నుంచి అక్టోబర్ 21 వరకూ సెలవులు ఇస్తారు. అనంతరం అక్టోబర్ 22న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. అంటే ప్రతీ ఏటా ఇచ్చే 10 రోజుల దసరా సెలవులకు తోడు మరో రెండు రోజులు అదనపు సెలవులు కలుపుకుంటే ఈసారి 12 రోజులు సెలవులు రాబోతున్నాయి.

AP Schools Dussehra Holidays Government Releases Holiday Schedule
FBIని కూడా వాడేస్తారా ? ఏపీ పరువుతీశారు..! జగన్ ఫైర్..!
FBIని కూడా వాడేస్తారా ? ఏపీ పరువుతీశారు..! జగన్ ఫైర్..!

మరోవైపు రాష్ట్రంలో సాధారణ పాఠశాలలకు ఈ దసరా సెలవుల షెడ్యూల్ వర్తించనుంది. కానీ క్రైస్తవ ఎయిడెడ్ పాఠశాలలకు మాత్రం ఈ సెలవులు కొంత తగ్గనున్నాయి. ప్రతీ ఏటా ఆయా పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు ఇచ్చే సంప్రదాయం ఉండటంతో ఆ మేరకు సెలవుల్ని దసరాలో సర్దుబాటు చేస్తారు. కాబట్టి ఆయా స్కూల్స్ కు ఆ మేరకు సెలవుల్లో మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో క్రిస్టియన్ స్కూల్స్ మాత్రం తమ సెలవుల షెడ్యూల్ ను వేరుగా ప్రకటించనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+