AB Venkateswara Rao: రిటైర్మెంట్ రోజు ఏబీని కరుణించిన జగన్ ?- ఆ పోస్టులో అపాయింట్ మెంట్

ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రిటైర్మెంట్ రోజు భారీ ఊరట దక్కింది. ఇప్పటికే గత ఐదేళ్లుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. ఆయన్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. నిఘా పరికరాల కొనుగోళ్ల కేసులో సస్పెన్షన్ తర్వాత పోస్టింగ్ లభించని ఏబీకి .. తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావును నిఘా పరికరాల కొనుగోళ్ల కేసులో వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఊరట పొందిన ఏబీకి మరోసారి సస్పెన్షన్ తో జగన్ షాకిచ్చారు. అనంతరం దీనిపై క్యాట్ ను ఆశ్రయించి ఊరట పొందిన ఏబీకి వెంటనే పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. అదే సమయంలో క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టునూ ఆశ్రయించింది. హైకోర్టు క్యాట్ ఉత్తర్వులపై స్టేకు నిరాకరించడంతో ఏబీకి పోస్టింగ్ ఇవ్వక తప్పని పరిస్ధితి ఏర్పడింది.

ap senior ips ab venkateswara rao to get posting on retirement day with hc order

ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం తనకు పోస్టింగ్ ఇవ్వాలని ఆయన నిన్న సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ఏబీకి పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏబీని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు వెలువడ్డాయి. పోస్టింగ్ లేకుండా రిటైర్ అయితే ఏబీకి తదుపరి సర్వీస్ ప్రయోజనాలు లేకుండా పోయే ప్రమాదం ఉండటంతో చివరి రోజూ ఏం జరుగుతుందో అన్న సస్పెన్స్ నెలకొంది. ఎట్టకేలకు ఏబీని జగన్ కరుణించినట్లు తెలుస్తోందిి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+