త్వరపడండి.. ఏపీలో ప్రతీ మహిళకూ రూ.5లక్షలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు , మహిళలు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సాహం ఇవ్వడానికి తీసుకువచ్చిన ఒక విశేషమైన పథకం ఏపీ స్త్రీ నిధి పథకం. ఈ పథకం ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు పేద, మధ్యతరగతి మహిళలకు ఐదు లక్షల రూపాయల వరకు లోన్లు ఇచ్చి వారి ఆర్థిక భరోసాకు బాసటగా నిలుస్తున్నారు.
ఏపీ స్త్రీ నిధి పథకంలో మహిళలకు రుణాలు
ఈ పథకం ద్వారా మహిళలు 5000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణాలను తీసుకోవచ్చు. అయితే ఈ పథకంలో లోన్ తీసుకోవాలి అనుకుంటే వారు ఏదైనా స్వయం సహాయక సంఘం లోని సభ్యురాలిగా ఉండాలి. చిన్న మొత్తంలో లోన్లు కావలసిన వారికి ఎటువంటి తనఖాలు లేకుండానే లోన్లు మంజూరు అవుతాయి. వారి కుటుంబ ఆదాయాన్ని చూసి లోన్ ఇస్తారు.

వ్యాపారాల నుండి చిన్న పరిశ్రమల దాకా లోన్లు
అదే పెద్ద మొత్తంలో లోన్ తీసుకునేవారు వారు ఏ వ్యాపారం చేస్తారు? దానికి సంబంధించిన అన్ని పూర్తి వివరాలు చూసి లోన్లు ఇస్తారు.
వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాలు, టైలరింగ్,, డెయిరీ ఫార్మ్ ,మేకల ఫార్మ్,గొర్రెల ఫార్మ్, కిరాణా షాపులు, ఇంకా చిన్న చిన్న పరిశ్రమల కోసం ఏపీ స్త్రీ నిధి పథకం ద్వారా మహిళలు లోన్లు తీసుకోవచ్చు. ఈ లోన్లకు సంబంధించి వడ్డీ రేటు 6% నుంచి 12 శాతం వరకు ఉంటుంది.
లోన్ల చెల్లింపు ఇలా
కాలపరిమితి తక్కువగా పెట్టుకుని త్వరగా చెల్లించే వారికి వడ్డీ తక్కువగాను, కాల పరిమితి ఎక్కువగా ఉన్నవారికి నెలవారి వడ్డీ ఎక్కువగానూ ఉంటుంది. ఈ లోన్లు నెలవారీ లేదా మూడు నెలలకు ఒకసారి తిరిగి చెల్లించవచ్చు. సంవత్సరం నుంచి ఐదేళ్లలోపు ఈ రుణాలను చెల్లించవచ్చు.
స్వయం సహాయక సంఘాల సభ్యులకే ఈ పథకం వర్తింపు
అయితే ఈ రుణాలు వ్యక్తిగతంగా ఇచ్చినప్పటికీ ఇవి స్వయం సహాయక సంఘాల గ్రూపు ద్వారా తీసుకుంటున్న లోన్లు కాబట్టి స్వయం సహాయక బృందం అంతటి పైన ఈ లోన్లను చెల్లించే బాధ్యత ఉంటుంది.ఎవరైతే లోన్ తీసుకున్నారో సదరు మహిళ వద్ద నుండి స్వయం సహాయక సంఘాల ద్వారా డబ్బులు తీసుకొని మళ్లీ లోన్లను చెల్లిస్తారు ఈ లోన్లలో దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు.
స్త్రీ నిధి పథకంతో ఆర్ధిక స్వావలంబన సాధిస్తున్న మహిళలు
ఏపీలో ఈ స్త్రీ నిధి లోన్ల ద్వారా చాలామంది మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారు. చిన్నచిన్న కిరాణా షాపులు, ఫ్యాన్సీ, జనరల్ స్టోర్స్, టైలరింగ్ దుకాణాలు పెట్టుకొని తమ కాళ్ళ మీద తమ నిలబడటమే కాకుండా కుటుంబానికి కూడా బాసటగా నిలుస్తున్నారు. మీరు కూడా ఆర్థిక స్వావలంబన సాధించాలనుకుంటే డ్వాక్రా గ్రూపులలో సభ్యులు అయితే ఏపీ ప్రభుత్వం అందించే ఏపీ స్త్రీ నిధి పథకం ద్వారా లోన్ తీసుకుని వ్యాపారం మొదలెట్టండి.












Click it and Unblock the Notifications