నారాయణ అరెస్ట్ పై అచ్చెన్నాయుడు ఫైర్-జగన్ వైఫల్యాల దృష్టిమరల్చేందుకే..
పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్ధల అధినేత నారాయణను అరెస్టు చేయడాన్ని టీడీపీ తప్పుబట్టింది. నారాయణ అరెస్ట్ పై స్పందించిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకే ఆయన్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు.
మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారని విమర్శించారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారని తెలిపారు.

రోజురోజుకూ జగన్ రెడ్డి పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెబుతుంటే.. నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై నెట్టారని ఆరోపించారు. అక్రమ అరెస్ట్ ల పట్ల భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.












Click it and Unblock the Notifications